Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీసీ కుల గణన చేపట్టాలి: విజయసాయిరెడ్డి

ఢిల్లీ: దేశంలో జరిగే జనాభా లెక్కల్లో బీసీ కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. వెనుకబడిన కులాల సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు బీసీ కులాల వివరాలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కిందకు రాని కులాల జనాభా భారీగా ఉందన్నారు. కానీ వారికి సంబంధించిన కచ్చితమైన వివరాలేవీ లేవన్నారు. అనేక మంది అనర్హులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో బీసీ రిజర్వేషన్‌ కింద ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. దీనివల్ల బీసీల్లో అర్హులైన నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  Advertisement
Advertisement