Abn logo
Oct 14 2021 @ 20:14PM

రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడబోతోంది: రఘురామ

హైదరాబాద్: వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం దారుణమని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమనేది ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఎంపీ రఘురామ అన్నారు. పీఆర్సీకి కమిటీ వేశారని.. ఆ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారా? అని రఘురామ ప్రశ్నించారు. తెలంగాణలో 30 శాతం ఫిట్మెంట్‌ ఇచ్చారని.. మరి ఏపీలో ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదని, ఉద్యోగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం చాలా దారుణమని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. రావాల్సిన దానికి కూడా అడగలేని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారని, టైమ్‌కి జీతాలు రావు, అలవెన్సులకు అర్హత ఉండదు, చాలీచాలని వేతనంతో ఎలా బతుకుతారని ఆయన ప్రశ్నించారు. అన్యాయం జరిగితే ఉద్యోగులు చైతన్యంతో ప్రభుత్వాన్ని నిలదీసేవారని, ఎందుకు ఉద్యోగ సంఘాలు మూగబోయాయో అర్థం కావడంలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రజలు ఓట్లు వేసింది జగన్‌కు.. సజ్జలకు పాలనతో ఏం సంబంధం అని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడబోతోందని, ఉద్యోగుల కనీస హక్కులను కాలరాస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption