ఢిల్లీ: ఏపీ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉందని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం సహకారం అందించాలని కోరారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఏపీని ఆర్థిక కష్టాల నుంచి కేంద్రం బయటపడేయాలన్నారు. ఏపీ పట్ల ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సానుభూతి చూపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్థిక కష్టాల నుంచి ఏపీ బయటపడే మార్గం లేదన్నారు. ఆర్థికంగా భరించలేని స్థాయిలో ఉన్నామని ఆయన వాపోయారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు.