అమరావతి: రాష్ట్రంలో 11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం మండలి చైర్మన్ కార్యాలయంలో కొత్త ఎమ్మెల్సీలతో చైర్మన్ మోషేన్‌రాజు ప్రమాణం చేయించారు. శివరామిరెడ్డి, అరుణ్, రఘురాం, ఉదయ్‌భాస్కర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, హనుమంతరావు, రఘురాజు, కల్యాణి, మాధవరావు, కృష్ణరాఘవ జయేంద్ర భారత్, శ్రీనివాస్ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు.