Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

Driverను కొట్టిన చంపిన తర్వాత కథ అల్లారా.. ఏది నిజం..!?

twitter-iconwatsapp-iconfb-icon

 • చంపేసి డ్రామా
 • కారు డ్రైవర్‌ను నేనే చంపా..
 • పోలీసు విచారణలో వెల్లడించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌
 • చనిపోయిన తర్వాత మృతదేహాన్ని పెద్ద కర్రతో చితక్కొట్టి కక్ష తీర్చుకున్న వైనం
 • తీరా రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరణ
 • హత్య జరిగిన వైనాన్ని వెల్లడించిన ఎస్పీ.. అరెస్ట్‌పై రోజంతా హైడ్రామా
 • వివరాల్లో తప్పులతో మేజిస్ట్రేట్‌ వద్దకు అటు.. ఇటు..
 • హత్య తీవ్రతను తగ్గించేందుకు విచారణలో కట్టుకథ అల్లారనే అనుమానం
 • తీవ్రంగా కొట్టడంతో చనిపోయాడా? చనిపోయిన తర్వాత కొట్టారా? అనుమానాలెన్నో
 • వచ్చే నెల 6వరకు అనంతబాబుకు రిమాండ్‌..
 • రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలుకు తరలింపు


(కాకినాడ,ఆంధ్రజ్యోతి)/ కాకినాడక్రైం: ‘నేనే చంపాను. కోపం తట్టుకోలేక కొట్టా ను.. ఇది నేను ఒక్కడినే చేసిన హత్య..’ ఇదీ వైసీపీ ఎమ్మెల్సీ, డ్రైవర్‌ హత్య కేసు నిందితుడు అనంత ఉదయభాస్కర్‌ పోలీ సుల విచారణలో చెప్పిన మాటలు. ముం దునుంచీ అంతా అనుమానిస్తున్నట్లుగానే హంతకుడతడే అయ్యాడు. సోమవారం ఇతడి అరెస్ట్‌పై తీవ్ర హైడ్రామా నడిచింది. అదుపులోకి తీసుకుని విచారించిన పోలీ సులు కనీసం అరెస్ట్‌ చేశామనే విషయం రాత్రి వరకు బయటకు పొక్కనీయలేదు. అర్ధరాత్రి 12గంటల వరకు రిమాండ్‌ విషయంలో హైడ్రామా నడిచింది.


పోస్టుమార్టం నివేదికతో..

ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ డ్రైవర్‌ హత్య విషయంలో అగుడగుడునా అనేక వివాదాలు ముసురుకున్నాయి. రోడ్డు ప్రమాదమని కట్టుకథ అల్లి తప్పించుకుందామనుకున్న ఉదయభాస్కర్‌ చివరకు దొరికిపోవాల్సి వ చ్చింది. పోస్టుమార్టం నివేదిక అసలు బండారం బయట పెట్టేయడంతో చివరకు చేసేది లేక పోలీసులకు లొంగిపోయాడు. దీంతో రెండు రోజుల తర్జనభర్జన తర్వాత పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు చూపించారు. ఉదయభాస్కర్‌ వెల్లడించిన విషయాలు పరిశీలిస్తే తనది ఉద్దేశపూర్వక హత్య కాదని, కోపంతో కొట్టానని చెప్పడం ద్వారా హత్య తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఇంటి నుంచి తీసుకువెళ్లి మృతదేహాన్ని తిరిగి అప్పగించే వరకు మధ్య అసలు నిజం ఏంటనేది విచారణ ద్వారా వెల్లడవలేదనే విషయాన్ని చాటుతోంది.

ఏది నిజం..

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని ఇంటినుంచి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టి చంపిన తర్వాత రోడ్డు ప్రమాదం కథ అల్లారా.. లేదా నెట్టడంతో తలకు గాయాలై చనిపోయాడని, ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డుప్రమాద మర ణంగా చూపించడానికి తీవ్రంగా కొట్టారా? అనేది తేలాల్సి ఉంది. ఇంటి నుంచి తమ కొడుకు తీసుకువెళ్లిన ఉదయభాస్కర్‌ చంపేశాడని తల్లి ఫిర్యాదు చేస్తే.. ఇంటినుంచి సొంతంగా మద్యం తాగడానికి సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లాడని, దారిలో కనిపించిన అతడిని పలకరించి ఉదయ భాస్కర్‌ తన కారు ఎక్కించుకున్నాడని ఎస్పీ వివరించారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. ఇలా చెప్పడం వెనుక పథకం ప్రకారం హత్య చేసే ఉద్దేశం లేదని నిందితుడు తెలివిగా చాటాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అరెస్ట్‌ను రాత్రి వరకు ధ్రువీకరించని పోలీసులు, 7గం టల తర్వాత జీజీహెచ్‌కు వైద్య పరీక్షలకు తరలించారు. అంతకుముందు నిందితుడి పేరుతో ఓపీ రాయించారు. ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు మేజిస్ట్రేట్‌ వద్ద రాత్రి 8.30గంటలకు ప్రవేశపెడ తారని భావించారు. తీరా సమయం ఇవ్వకపోవడంతో తిరిగి 9.14 గంట లకు అనంతబాబును తీసుకువచ్చారు.


ఆధార్‌కార్డులోను, కేసు డైరీ వివరాల్లోను నిందితుడి పేరు వ్యత్యాసం ఉండడంతో నాలుగుసార్లు మేజిస్ట్రేట్‌ తప్పుబట్టారు. దీంతో పదేపదే పోలీసులు మార్పులు చేయాల్సి ఉంది. దీంతో రాత్రి 11.30గంటలకు మేజిస్ట్రేట్‌ తన తీర్పు ఇచ్చారు. ఉదయ భాస్కర్‌కు వచ్చేనెల 6 వరకు రిమాండ్‌ విధించారు. దీంతో అర్ధరాత్రి 12గంటలు దాటాక కాకినాడనుంచి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎస్పీ కార్యాల యంవద్ద పోలీసులు హైడ్రామా నడిపారు.

సోమవారం సాయంత్రం ఓ తల్లి, సోదరి పవన్‌, సుబ్రహ్మణ్యం అనే ఇద్దరు యువకులను పోలీసులు విచారణ పేరుతో తీసుకువచ్చి తమకు ఇంకా అప్పగించలేదని, ఉదయభాస్కర్‌ స్థానంలో వారిని నిందితులుగా చూపిస్తారేమోనంటూ రోధించారు. కానీ ఎస్‌ఐ రత్నం వీరిని అక్కడినుం చి గెంటేశారు. ఎస్పీ కార్యాలయం ముందు రోధించవద్దని హెచ్చరించారు. ఓ ఆటోను బలవంతంగా ఆపి వీరిని అక్కడినుంచి పంపేశారు.


ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ అరెస్టు

వివరాలు వెల్లడించిన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

కాకినాడ క్రైం, మే 23: ఎమ్మెల్యే అనంత ఉద యభాస్కర్‌ మాజీ కారుడ్రైవరు వీధిసుబ్రహ్మణ్యం హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అనంతఉదయభాస్కర్‌ను సోమవారం కాకినాడ రూరల్‌ మండలం పండూ రు సమీపంలో అరెస్టు చేశారు. దళితసంఘాలు, ప్రజాసంఘాలు కూడా అక్కడకు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది. రాత్రి సమయం లో ఉదయభాస్కర్‌ను పోలీసు బందోబస్తు మధ్య కాకినాడ జీజీహెచ్‌కు వైద్యపరీక్షల నిమత్తం తరలించారు. జీజీహెచ్‌వద్ద పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. వైద్యపరీక్షల తర్వాత స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ జానకి ముం దు హాజరుపరిచారు. కేసు వివరాల నివేదికలో కొన్ని తప్పులు గుర్తించి న మెజిస్ట్రేట్‌ నివేదిక సరి చేసుకురావాలని పోలీసులకు వెనక్కి పంపించారు. రాత్రి 8.30 గంటలకు ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి హత్యపై కీలక వివరాలు వెల్లడించారు.

హత్య జరిగిందిలా...

ఈనెల 19న సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు ఉదయభాస్కర్‌ తెలిపాడన్నారు. శ్రీరామ్‌నగర్‌ శంకర్‌ టవర్‌వద్ద తమ మధ్య ఘర్షణ జరిగిందని, తోపులాట లో ఐరన్‌రాడ్‌ తగిలి సుబ్రహ్మణ్యానికి బలమైన గాయమైందని, ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయంలో ఊపిరి ఆగిపోయిందని చెప్పాడని తెలిపారు. సుబ్రహ్మణ్యం మృతితో రోడ్డు ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించడానికి ఉదయభాస్కర్‌ ప్రయత్నించాడని పేర్కొన్నారు. ఇలా గుర్తించాలంటే దేహంలో అన్నిచోట్లా గాయాలు ఉండేలా మృతదేహాన్ని కర్రతో కొట్టినట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ఉదయభాస్కర్‌పై క్రైం నెంబరు 195/22 అం డర్‌ సెక్షన్‌ 302, 201, ఆర్‌/డబ్ల్యు 34 ఐపీఎస్‌ సెక్షన్‌ 3(1)(ఆర్‌)(ఎస్‌) అండ్‌ సెక్షన్‌ 3(2) ఆఫ్‌ ది ఎస్‌సీ, ఎస్‌టీ(పీఓఏ)యాక్టు 1989 ప్రకారం నమోదు చేశామన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని,దర్యా ప్తు అధికారిగా కాకినాడ డీఎస్పీ భీమారావును నియమించామన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.