వైసీపీ ఎమ్యెల్సీని వెంటనే అరెస్ట్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST

కాకినాడలో వైసీపీ ఎమ్యెల్సీ అనంతబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశా రు.

వైసీపీ ఎమ్యెల్సీని వెంటనే అరెస్ట్‌ చేయాలి
అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేస్తున్న టీడీపీ నాయకులు

బి.కొత్తకోట మే 22 : కాకినాడలో వైసీపీ ఎమ్యెల్సీ అనంతబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని టీడీపీ నాయకులు  డిమాండ్‌ చేశా రు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు, హత్యలకు నిరసనగా ఆదివారం బి.కొత్తకోట పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం దగ్గర టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె టీడీపీ ఎస్సీ సెల్‌ నియోజక వర్గ అధ్యక్షుడు సురేంద్రబాబు మాట్లాడుతూఎమ్యెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌ సుబ్రమణ్యం డెడ్‌ బాడీ పై హత్య చేసినట్లు అధారాలు ఉన్నా అధికారాన్ని అడ్డు పెట్టుకుని హత్య కేసును ప్రమాద కేసుగా చిత్రికరిస్తున్నారని ఆరోపించారు.  పీటీఎం మాజీ జడ్పీటీసీ ఈశ్వరప్ప మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ టౌన్‌ ఉపాధ్యక్షుడు దేవుడు నాగరాజు, జిల్లా నాయకులు కుడుము రంజిత్‌కుమార్‌, తెలుగు యువత పట్టణ నాయకులు మంజు, ఎస్సీ సెల్‌ పట్టణ నాయకులుఅంజనేయులు, రవి, రఘు, గోవిందు పాల్గొన్నారు.  

నిమ్మనపల్లెలో: వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పైనే దాడులు ఎక్కువయ్యాయని  టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటరమణ ఆరోపించారు. ఆదివారం స్థానిక అంబేధ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా రాజంపేట ఎస్సీసెల్‌ అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌, ఎస్సీసెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి జయరాం మాట్లాడుతూ నిన్న కాకినాడ ఎమ్మెల్సీ ఆనందబాబు తన కారు డ్రైవర్‌ సుబ్రమణ్యంను అతి కిరాతకంగా హతమార్చి  శవాన్ని తీసుకెళ్లి వారి ఇంటి వద్దే వదిలి వెళ్లటం దారుణమైన చర్య అన్నారు. ఎమ్మెల్సీ దాడిలో మృతి చెందిన సుబ్రమణ్యం కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని అలాగే ఎమ్మెల్సీ ఆనందబాబును వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాశ్‌, బాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.    

దళితులపై దాడులు, హత్యలు చేయడం సిగ్గుచేటు


కురబలకోట, మే 22 దళితులపై దాడులు, హత్యలు చేయడం సిగ్గుచేట ని రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం మండలంలోని అం గళ్లులో దళితుడు సుబ్రమణ్యం హత్య ను ఖండిస్తూ విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దళి తుల ఒట్లతో గద్దెను ఎక్కి వారిని అణచి వేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిం చారు. దళితుల రక్షణ కోసం చేపట్టిన అట్రాసిటీలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. దళితుడు  సుబ్రమణ్యం హత్యకు కారణమైన ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదు చేయాలని, మృతుడి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేసియాను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణరెడ్డి, మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ బొగ్గు భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:30:00+05:30 IST