అనంతబాబుకు వైద్య పరీక్షలు పూర్తి... ఎస్పీ కార్యాలయానికి తరలింపు

ABN , First Publish Date - 2022-05-24T01:41:07+05:30 IST

జీజీహెచ్‎లో ఎమ్మెల్సీ అనంతబాబుకు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. దీంతో ఆయనను పోలీసులు ఎస్పీ కార్యాలయానికి..

అనంతబాబుకు వైద్య పరీక్షలు పూర్తి... ఎస్పీ కార్యాలయానికి తరలింపు

కాకినాడ: జీజీహెచ్‎లో ఎమ్మెల్సీ అనంతబాబుకు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. దీంతో ఆయనను పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు అనంతబాబు ఒప్పుకోవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు పూర్తి కావడంతో అనంతబాబును కాసేపట్లో జడ్జి ముందు హాజరుపర్చే అవకాశం ఉంది. అనంతబాబును పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్తున్నారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. 



Updated Date - 2022-05-24T01:41:07+05:30 IST