Bail కోసం అనంతబాబు ప్రయత్నాలు

ABN , First Publish Date - 2022-06-03T02:35:42+05:30 IST

డ్రైవర్‌ను హత్య చేసి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Bail కోసం అనంతబాబు ప్రయత్నాలు

కాకినాడ: డ్రైవర్‌ను హత్య చేసి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా అట్రాసిటీ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో బెయిల్‌ పిటిషన్‌కు 919/2022 నెంబర్‌ కేటాయించారు. ఈనెల 7న ఇది విచారణకు రానుంది. ఆ రోజు ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు రానున్నారు. బెయిల్‌ పిటిషన్‌ వేసిన నేపథ్యంలో అనంతబాబుకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్‌ ఇవ్వకూడదంటూ పలు దళిత సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం సెంట్రల్‌ జైల్లో ఉన్న అనంతబాబుకు ఈనెల 6తో పదిహేను రోజుల రిమాండ్‌ ముగియనుంది. 


ఈనేపథ్యంలో ఆయన్ను కస్టడీలోకి తీసుకునేందుకు కాకినాడ సర్పవరం పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకోసం రిమాండ్‌ తర్వాత హత్యకు సంబంధించి సేకరించిన కొన్ని కీలక ఆధారాలు సిద్ధం చేశారు. వీటి ఆధారంగా కస్టడీకి కోరనున్నారు. ఇందుకోసం శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేయనున్నారు వాస్తవానికి రిమాండ్‌ విధించిన మరుసటిరోజే కస్టడీ కోసం పోలీసులు  ప్రయత్నించాలి. కానీ అదేదీ జరగలేదు. తీరా రిమాండ్‌ ముగియడానికి నాలుగురోజులే సమయం ఉండడంతో ఇప్పుడు హడావుడిగా కస్టడీ ప్రయత్నాలు సాగిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - 2022-06-03T02:35:42+05:30 IST