దర్జాగా బయట తిరుగుతున్న YCP MLC అనంత భాస్కర్
ABN , First Publish Date - 2022-05-21T18:08:49+05:30 IST
హత్య కేసులో ఇరుక్కున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ దర్జాగా బయట తిరుగుతున్నారు.
కాకినాడ: హత్య కేసులో ఇరుక్కున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ దర్జాగా బయట తిరుగుతున్నారు. కాసేపట్లో రాజవొమ్మంగి మండలంలో గృహ మంజూరు పత్రాల పంపిణీకి ఎమ్మెల్సీ హాజరుకానున్నారు. ఇందుకోసం టెంట్లు వేసి మరీ అధికారులు జనాన్ని పోగేసి సభ నిర్వహిస్తున్నారు. అతిధిగా వస్తున్న ఎమ్మెల్సీ పేరుతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. నిన్న దర్జాగా రంపచోడవరం ఎమ్మెల్యేతో కలిసి రెండు వివాహాలకు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ హాజరయ్యారు. అయితే ఇంత జరుగుతున్నప్పటకీ పోలీసులు కళ్లప్పగించి చూస్తుడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.