Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 10 Aug 2022 11:11:58 IST

Vasantha Krishnaprasad: మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యేకు సమస్యల స్వాగతం

twitter-iconwatsapp-iconfb-icon
Vasantha Krishnaprasad: మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యేకు సమస్యల స్వాగతం

ఎన్టీఆర్: మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ (Vasantha Krishnaprasad)కు సమస్యలు స్వాగతం చెబుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు  నారాయణ నగర్ కు చెందిన ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. ముగ్గురు కొడుకులు ఉండి రెండు సార్లు ఇళ్ల స్థలం కోసం అప్లై చేస్తే వచ్చిన స్థలాన్ని కొందరు నాయకులు తీయించి వేశారని ఎమ్మెల్యే (YCP MLA) ముందు సయాద్ సీలార్ అనే వ్యక్తి వాపోయాడు. ఏళ్ల తరబడి రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని, పంచాయతీ నీరు రాక మంచి నీటి కోసం నానా పాట్లు పడుతున్నామని తల్లి, కొడుకులు తెలిపారు. అయితే సమస్యలు చెప్పే వారిని ఎమ్మెల్యే వసంత కోపగించుకుంటున్నారు. ‘‘నేను మాట్లాడాకే మీరు మాట్లాడాలని, పథకాలు వస్తున్నాయా లేదా’’ అంటూ ఎమ్మెల్యే (MLA) సమాధానం దాట వేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే ఫోటో దిగి వెళ్ళిపోయాక పలువురు మహిళలు తిట్టుకునే పరిస్థితి నెలకొంది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.