విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan)పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali nani) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పని పాటలేని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలు తిప్పి కొడతామన్నారు. గుడివాడ 22వ వార్డులో ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొని ప్రసంగించారు. పవన్ చెప్పే తీరులో ఎటువంటి లాజిక్ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేక ఓటు లేదని తెలిపారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క దాన్ని అమలు చేసినా, తమకు అనుకూల ఓటు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ప్రజల ఇతర అవసరాలు తెలుసుకునేందుకే గడప గడపకు మన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా విడిగా పోటీ చేసినా తమకు ఉండేది ఏమీ లేదన్నారు. మిగిలిన ఇరవై నాలుగు సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలని తెలిపారు. ‘‘మా 151సీట్లు పక్కగా తిరిగి మాకు వస్తాయి’’ అంటూ కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి