చిత్తూరు: పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పవన్‌కు రాజకీయ పరిపక్వత లేదన్నారు. సినిమా డాన్సులంత ఈజీ కాదు రాజకీయమంటేనన్నారు. పవన్ లాగా రాజకీయాల్లోకి రావడానికి బిక్షం ఎత్తుకునే పరిస్థితి జగన్‌కు లేదని మండిపడ్డారు. ‘‘పవన్ లాగా 2014 ఎన్నికల్లో బీజేపీ ,టీడీపీతో కలిసి ప్యాకేజీలు అందుకోలేదు. రాజ్యాంగబద్ధంగా ప్రజల ఆశీస్సులతో జగన్ సీఎం అయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్యాకేజీల కోసం కులాలను రెచ్చగొట్టే డ్రామాలు వేయవద్దు. దమ్ము ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలి. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన ఘనత పవన్ కళ్యాణ్‌ది. పవన్ కల్యాణ్‌నే ఒక పెద్ద సన్యాసి. అలాంటిది ఇతరులను సన్యాసం అనడంలో అర్థమేముంది. సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడడం పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లే అవుతుంది. ఒక చేతిలోని రాయిని ఒకరిపైకి విసిరి ఇంకో చేతిలోని రాయిని అతని పైకే విశారుకున్నట్టు ఉంది పరిస్థితి. మొత్తంగా పవన్‌కు మానసికంగా అతని మెదడు దెబ్బ తిన్నట్టు అర్థమవుతుంది.’’ అని శ్రీనివాసులు విమర్శలు చేశారు.