Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిని ఘెరావ్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు

కాకినాడ: కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిని సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఘెరావ్ చేశారు. జగన్నాథపురంలో సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ స్కూల్ మూయ్యొద్దని వారు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూసివేత ప్రయత్నాలు విరమించుకోకపోతే ఊరుకునేది లేదని మండిపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రులు... ఎమ్మెల్యేను చుట్టుముట్టి నిలదీశారు.  ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆట ఆడుకుంటుందని ధ్వజమెత్తారు. ఏ పాపం చేశారు అని చదువుతున్న పాఠశాలలను మూస్తున్నారని ఎమ్మెల్యేపై  తల్లిదండ్రులు  నిప్పులు కక్కారు. పుట్టి పెరిగిన ప్రాంతాలను వదలి ఎక్కడకు పోవాలని...తమ పిల్లలకు ఇక్కడ ఉన్న రక్షణ ఎక్కడా ఉండదని ఎమ్మెల్యేకు తల్లిదండ్రులు వివరించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement