నెల్లూరు: సీఎం జగన్‌పై టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు చంద్రబాబు, లోకేష్‌దే బాధ్యత అని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. సీఎంపై వాడిన టీడీపీ నేతల భాషను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఎమ్మెల్యే ఆనం పేర్కొన్నారు. చంద్రబాబు సంస్కారవంతంగా రాజకీయాలు చేయాలని ఆనం సూచించారు. రాష్ట్ర హోంమంత్రి, డీజీపీపై చంద్రబాబు వ్యాఖ్యలు సబబు కాదని ఆనం హితవు పలికారు.