వెలవెలబోయిన జిల్లా ప్లీనరీ

ABN , First Publish Date - 2022-07-04T06:30:32+05:30 IST

వైసీపీ శ్రేణుల్లో ప్లీనరీ జోషేమీ కనిపించడంలేదు. సభ జరుగుతుండగానే జనం వెళ్లిపోతున్నారు.

వెలవెలబోయిన జిల్లా ప్లీనరీ
కొవ్వూరులో జరిగిన వైసీపీ జిల్లా ప్లీనరీలో ఖాళీగా ఉన్న కుర్చీలు

వైసీపీ జిల్లా ప్లీనరీకి పాత కథే

గ్రామాల జనం తరలింపు

అయినా కూర్చోని వైనం

సభ ప్రారంభానికే ఖాళీ

ముఖం చాటేసిన కార్యకర్తలు

నాయకుల అసహనం

పారిశుధ్య కార్మికులతో పనులు


    ( రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

 వైసీపీ శ్రేణుల్లో ప్లీనరీ జోషేమీ కనిపించడంలేదు. సభ జరుగుతుండగానే జనం వెళ్లిపోతున్నారు. చివరకు ఖాళీ కుర్చీలకే నేత ఘోష వినిపించాల్సి వస్తోంది. వైసీపీ అధికారంలోకి రాకముందు కార్యకర్తలు, ప్రజల్లో ఉన్న ఊపు కనిపించడంలేదు. ప్రజల మాట దేవుడెరుగు. కార్యకర్తలే సభలకు రావడం లేదు. కొవ్వూరులో ఆదివారం జరిగిన వైసీపీ జిల్లా ప్లీనరీకి స్వచ్ఛందంగా వచ్చిన వారి సంఖ్య బాగా తక్కువే. స్కూళ్లు బస్సు లు, ఆటోలు మీద మహిళలను, వృద్ధులను తరలించారు.కొందరు మహిళలు వాళ్ల పేర్లను ఒక రిజిష్టర్‌లో రాసుకుని సంతకాలు పెట్టించుకోవడం గమనార్హం. ఒక్కొక్కరికీ రూ.500, బిరియానీ ప్యాకెట్‌ ఇచ్చినట్టు సమాచారం. ప్లీనరీలలో కార్యకర్తలకు, ప్రజలకు ఇంకా ఏమి చేస్తామనే విషయాలు అసలు ప్రస్తావనకు రాకపోగా, గతమంతా ఘనకీర్తి అన్నట్టు తమను తాము కీర్తించుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. గ్రామాల్లో వలంటీర్లు, సచివాలయాలు, అక్కడ సీఎం ఒక్కరే సరిపోతారా కార్యకర్తలకు కనీస విలువ లేకపోతే ఎలా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటువంటి సమయంలో ప్లీనరీల వల్ల  కాస్త జోష్‌ పెంచే ప్రయత్నాలు కూడా లేవు. మంత్రులు పలుసార్లు సభికుల చేత చప్పట్లు కొట్టించాలనే ప్రయత్నం చేస్తున్నా పెద్దగా స్పం దన రావడం లేదు. దీంతో నీరుగారిపోతున్న మం త్రులు కొందరు ఇప్పుడే నీరసపడిపోతే ఎలా, ఇంకా భోజన సమయం కూడా కాలేదు కదా ఎలా అని ఛలోక్తులతో సరిపెట్టుకోవడం గమనార్హం.జిల్లాలో  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉం డగా ఇప్పటికే 6 అసెంబ్లీ నియోజకవర్గాల ప్లీనరీలు, జిల్లాస్థాయిప్లీనరీ పూర్తయింది. ఇక రాజానగరం ప్లీనరీ మాత్రం  సోమవారం జరగనుంది. 


కొవ్వూరులో 2 గంటలు ఆలస్యంగా సభ..


కొవ్వూరు, జూలై 3 : వైపీసీ జిల్లా ప్లీనరీ సమావేశంలో ముఖ్య నాయకుల ప్రసంగాలు వినేవారు లేక సభా ప్రాంగణం వెలవెల బోయింది. ఆది వారం ఉదయం 10 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా 12 గంటలకు ప్రారంభించారు. దీంతో కార్యకర్తలు నాయకులు మధ్యలోనే లేచివెళ్లిపోయారు.దీంతో  సభా ప్రాంగణం ఖాళీ అయి పో యింది.  తూర్పు గోదావరి జిల్లా వైసీపీ జిల్లా ప్లీనరీ సమావేశం కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. కొవ్వూరు మెరకవీధి నుంచి మోటారుసైకిళ్ల ర్యాలీగా నాయకులు సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ పతాకాన్ని ఎగురవేశారు.అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 25 మంది మంత్రులను కేబినెట్‌లోకి తీసుకున్నారన్నారు.హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రతిపక్ష టీడీపీకి ఎల్లో మీడియా, జనసేనకు సోషల్‌ మీడియా ఉన్నాయని, వైసీపీకి కార్యకర్తలే జగన్‌ మీడియా అన్నారు. రీజనల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి చంద్రబాబు, టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. ఎం పీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌,మార్గాని భరత్‌ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు.జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చి నా తమ కుటుంబం ఎప్పుడూ అం డగా ఉం టుందన్నారు. హత్యకు గురైన ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ కుటుంబానికి పార్టీ తరపున రూ. 25 లక్షల ఆర్థిక సహకారాన్ని అందజేశారు.  ముని సిపల్‌ పారిశుధ్య సిబ్బందితో పార్టీ సమావేశాలకు పనులు చేయించడంపై పట్టణ ప్రజలనుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి.కార్యక్రమంలో ఎమ్మె ల్యేలు జ్యోతుల చంటిబాబు, జి.శ్రీనివాస నాయు డు, తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణరెడ్డి, రుడా చైర్మన్‌ షర్మిలారెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి,చందన నాగేశ్వర్‌, జక్కంపూడి గణేష్‌, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-04T06:30:32+05:30 IST