సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన మంత్రి అనుచరుడు సుభాని అరెస్ట్

ABN , First Publish Date - 2021-12-22T01:07:22+05:30 IST

వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన మంత్రి బాలినేని అనుచరుడు సుభానీని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీపై ...

సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన మంత్రి అనుచరుడు సుభాని అరెస్ట్

ఒంగోలు: వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన మంత్రి బాలినేని అనుచరుడు సుభానిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీపై వ్యాఖ్యలు చేశాడని సుబ్బారావును బంధించి సుభాని దాడి చేశారు. అయితే మంత్రి బాలినేని కలుగజేసుకోవడంతో సుబ్బారావును సుభాని బయటకు వదిలిపెట్టారు. సుబ్బారావుపై దాడి చేసేటప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సుభానిపై సుబ్బారావు ఒంగోలు ఒన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల్లో సుభాని, సుబ్బారావు పాల్గొన్నారు. ఈ ఇద్దరూ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అనుచరులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే సుబ్బారావుపై దాడిని వైశ్య సంఘం ఖండించింది. వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించింది. 




Updated Date - 2021-12-22T01:07:22+05:30 IST