వైసీపీ నేతలు తక్షణం పదవులకు రాజీనామా చేయాలి

ABN , First Publish Date - 2022-01-28T05:01:03+05:30 IST

అధికార వైసీపీ నాయకులు రెండు నాలుకల ధోరణి వీడి తక్షణం తమ పదవులకు రాజీనామా చేసి, జిల్లా ఉద్యమంలో పాల్గొంటే ప్రజలు విశ్వసిస్తారని, లేదంటే మీకు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారని బీజేపీ రాజంపేట అసెంబ్లీ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు పేర్కొన్నారు.

వైసీపీ నేతలు తక్షణం పదవులకు రాజీనామా చేయాలి
మాట్లాడుతున్న బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమే్‌షనాయుడు

బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి  రమే్‌షనాయుడు 


రాజంపేట, జనవరి 27 : అధికార వైసీపీ నాయకులు రెండు నాలుకల ధోరణి వీడి తక్షణం తమ పదవులకు రాజీనామా చేసి, జిల్లా ఉద్యమంలో పాల్గొంటే ప్రజలు విశ్వసిస్తారని, లేదంటే మీకు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారని బీజేపీ రాజంపేట అసెంబ్లీ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు పేర్కొన్నారు. గురువారం రాజంపేట బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అధికార పార్టీ వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయకుండా రాజంపేటకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొనడం దారుణమన్నారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో సీఎం జగన్‌ ప్రకటించినట్లుగా పార్లమెంట్‌ కేంద్రాలను జిల్లా కేంద్రాలుగా చేయడానికి కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ సత్యసోధనలో తేలిన విషయం ఏమిటంటే.. రైల్వేకోడూరు, రాజంపేట అధికార పార్టీ నేతలు కొందరు రాయచోటిలో భూములు కొని రాజంపేటకు తీరని ద్రోహం చేశారన్నారు. అధికార పార్టీ నాయకులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే మొదట రాజీనామాలు చేసి ఉద్యమాల్లోకి రావాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.సురే్‌షరాజు, ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పట్టుపోగుల ఆదినారాయణ, బీజేపీ మహిళా మోర్చ జిల్లా కోశాధికారి సునీత, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర, హరిప్రసాద్‌, భరత్‌కుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.


బార్‌ అసోసియేషన్‌ సభ్యులు నిరసన 

రాజంపేట పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయనందుకు స్థానిక కోర్టు ఆవరణలో గురువారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఛాయాదేవి, కరుణాకర్‌రాజు, సింగంశెట్టి కృష్ణకుమార్‌, లక్ష్మీనారాయణ, వెంకటసుబ్బ య్య, జానీ, శేఖర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించ కపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి రాజంపేట జిల్లా సాధనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  

Updated Date - 2022-01-28T05:01:03+05:30 IST