Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీసుల సూచనలు బేఖాతరు చేస్తున్న వైసీపీ నేతలు

కృష్ణా: పోలీసుల సూచనలను వైసీపీ నేతలు బేఖాతరు చేస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో వైసీపీ నేతలు బరులు ఏర్పాటు చేశారు. కంచికచర్ల మండలం పెండ్యాలలో పేకాటశిబిరాలు, కోడిపందేలు ఏర్పాటు చేశారు. వైసీపీ రంగులతో  నాయకులు బరులు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు ఇంత చేస్తున్న అధికార యంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరిస్తోంది. పురుషులతో సమానంగా మహిళల పేకాట, మద్యం, కోడి పందేలు ఆడుతున్నారు.


జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అప్రమత్తత అవసరమని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, సంక్రాంతి పందేల ముందు ప్రమాదం కనిపించడం లేదు. పందేల్లో పాల్గొంటున్న వారు, వాటిని తిలకించడానికి వచ్చినవారు ఏమాత్రం కరోనా నిబంధనలు పాటించలేదు. మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్‌ వినియోగించడం మానేశారు. భౌతిక దూరం అనే పదానికి స్థానమే లేదు.

Advertisement
Advertisement