వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీస్తున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి

ABN , First Publish Date - 2020-07-01T00:05:13+05:30 IST

వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీస్తున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి

వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీస్తున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి

గుంటూరు: ప్రతి పార్లమెంటు పరిధిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు అన్ని జిల్లాల్లో భూముల పరిశీలనకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటిస్తున్నారని, దీన్ని బీజేపీ రాష్ట్ర పార్టీ స్వాగతిస్తుందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అయితే మెడికల్ కళాశాల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కోవిడ్ సమయంలో అట్టహాసంగా రాష్ట్రంలోని జిల్లాల పరిధిలో వైసీపీ ప్రజా ప్రతినిధులు భూముల పరిశీలన పేరున యాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆరోగ్యశాఖ మంత్రిని మేం ప్రశ్నిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం నిబంధన ప్రకారం పార్లమెంట్ పరిధిలో 30 నుంచి 50 ఎకరాల ఉన్నచోట మెడికల్ కళాశాల ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. హిందూపురంలో మెడికల్ కళాశాల పెట్టకుండా.. పక్క ఉన్న అసెంబ్లీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారని?, మెడికల్ కళాశాల పేరుతో వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరు తక్కువ.. ప్రచారం ఎక్కువ అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు.


Updated Date - 2020-07-01T00:05:13+05:30 IST