Abn logo
Oct 12 2021 @ 11:28AM

AP: వైసీపీ నేతల అక్రమాలు..30 కోట్లు హాంఫట్

అమరావతి: వైసీపీ నేతలు రూ. 30 కోట్లు హాంఫట్ చేశారు. పంటల బీమా సొమ్ములో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. పత్తి చేలుగా మామిడి, పామాయిల్ తోటలను చూపించి కోట్లలో బీమా సొమ్ము స్వాహా చేశారు. పత్తి సాగు చేయకుండానే వైసీపీ నేతలు తుఫానులో దెబ్బ తిన్నట్లు రికార్డులు పుట్టించారు. ఒక్క మైలవరం నియోజక వర్గంలోనే రూ. 4 కోట్లు స్వాహా చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇదే దందా. రూ. 30 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది.


ఈ ఏడాది మేలో పంటల బీమా సొమ్మును సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు. అవి నేరుగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి కాకుండా వైసీపీ నేతల ఖాతాల్లోకి జమ అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రూ. 170.41 కోట్లు విడుదల చేయగా ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే రూ. 9.49కోట్ల బీమా సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే ఈ మొత్తంలో అర్హులైన రైతుల ఖాతాల్లోకి చేరింది తక్కువ. వైసీపీ నేతల ఖాతాల్లోకి చేరింది ఎక్కువ. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండిImage Caption