అమరావతి: వైసీపీ నేతలపై టీడీపీ నేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడటమే కాకుండా.. ఇప్పుడు ఏకంగా మహనీయుల విగ్రహాలు పగలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నేత కోటేశ్వరరావు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రకటించారు. కోటేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి