Abn logo
Sep 17 2021 @ 20:01PM

ఏపీలో వైసీపీ నేతలు బజార్‌రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు: బోండా ఉమ

అమరావతి: ఏపీలో వైసీపీ నేతలు బజార్‌రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగి రమేష్ పక్కా ప్రణాళికతోనే మాజీసీఎం చంద్రబాబు ఇంటిపై దాడికి దిగారని తెలిపారు. సీఎం జగన్ అవినీతిని, అసమర్థ పాలనను అయ్యన్న ప్రశ్నించడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?.. తాము ఇలాగే వ్యవహరిస్తే జగన్ పాదయాత్ర చేసేవారా?  అని బోండా ఉమ ప్రశ్నించారు. వైసీపీ గూండాల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని బోండా ఉమ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండిImage Caption