ABN Reporter: ఉరవకొండలో ఏబీఎన్ రిపోర్టర్ మారెన్నపై వైసీపీ నేతల దాడి

ABN , First Publish Date - 2022-07-22T20:52:35+05:30 IST

జిల్లాలోని ఉరవకొండలో ఏబీఎన్ రిపోర్టర్ మారెన్నపై దాడి జరిగింది.

ABN Reporter: ఉరవకొండలో ఏబీఎన్ రిపోర్టర్ మారెన్నపై వైసీపీ నేతల దాడి

అనంతపురం: జిల్లాలోని ఉరవకొండలో ఏబీఎన్(ABN) రిపోర్టర్ మారెన్న(Marenna)పై దాడి జరిగింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ  పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి(Vishweshwar reddy)  పర్యటించారు. అయితే ప్రభుత్వ పథకాలు అందడం లేదంటూ విశ్వేశ్వర్ రెడ్డిని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు నిలదీశారు. ఈ క్రమంలో కవర్ చేస్తున్న ఏబీఎన్ రిపోర్టర్  మారేన్నను మాజీ ఎమ్మెల్యే  దుర్భాషలాడారు. సెల్ఫోన్ లాక్కుని చితకొట్టండంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలకు సైగలు చేశారు. విశ్వేశ్వర్ రెడ్డి కనుసైగలతో ఏబీఎన్ రిపోర్టర్ మారెన్నపై  వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. సెల్ ఫోన్ లాక్కొని వీడియోలు, ఫోటోలు డిలీట్ చేశారు. ఏబీఎన్‌తో పాటు మీడియా ప్రతినిధుల సెల్‌ఫోన్లను విశ్వేశ్వర్‌రెడ్డి అనుచరులు లాక్కున్నారు.


ప్రభుత్వ కార్యక్రమమైనా గడపగడపకు మన ప్రభుత్వం కవరేజ్‌కు రాకూడదంటూ మీడియాకు విశ్వేశ్వర్ రెడ్డి హుకుం జారీ చేశారు. ప్రజలు నిలదీతను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్న ఏబీఎన్‌పై మాజీ ఎమ్మెల్యే అక్కసు వెల్లగక్కారు. గడప గడప కార్యక్రమం సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. సమస్యలను ప్రస్తావించే వారిపై విశ్వేశ్వర్ రెడ్డి చిర్రుబుర్రులాడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ వైసీపీగా ఇన్చార్జిగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-07-22T20:52:35+05:30 IST