Abn logo
Sep 21 2021 @ 01:21AM

అర్ధరాత్రి టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుల దాడి

వైద్యచికిత్సలు పొందుతున్న బాధితుడు అంజనరెడ్డి


ఆత్మకూరు, సెప్టెంబరు20: వైసీపీ నాయకులు ఆర్ధరాత్రివేళ రెచ్చిపోయారు. మండలంలోని పాపంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త అంజనరెడ్డిపై ఐదుగురు వైసీపీ నాయకులు మూకుమ్మడిగా దాడిచేశారు. విచక్షణా రహి తంగా దాడిచేయడంతో బాధితుడితలకు బలమైన గాయాల య్యాయి. రక్తమోడుతూనే బాధితుడు పోలీస్‌ స్టేషనకు పరుగులు తీశాడు. ఐదుగురు వైసీపీ నాయకులు తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  సోమవారం రాత్రి తాను ఇంట్లో ఉన్న సమయంలో పాపంపల్లికి చెందిన వైసీపీ నాయకులు సత్యనారాయణ రెడ్డి, వాసదేవరెడ్డి, నాగేంద్రరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి తనపై మూకుమ్మడిగా దాడిచేశా రని ఫిర్యాదు చేశాడు.  విచారణ చేపట్టి నిందితులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం అంజనరెడ్డిని ఆస్పత్రికి తరలించారు.