విశాఖ: జిల్లా పరిధిలోని సీలేరులో దారుణం జరిగింది. దివ్యాంగురాలిపై వైసీపీ నేత వెంకట్రావు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా విషయం బయటకు చెబితే చంపేస్తానని హెచ్చరించారు. దీనిపై బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకట్రావు.. ప్రస్తుతం వైసీపీ సీలేరు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి తనపై దాడి చేసి అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది. మాట్లాడలేని స్థితిలో ఉన్న దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడడం దారుణమని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వికలాంగులు