Abn logo
Aug 5 2020 @ 17:59PM

సీఎం జగన్‌కు గుడి.. వైసీపీ నాయకులపై జనం సెటైర్లు

పశ్చిమగోదావరి: జిల్లాలోని గోపాలపురం మండలం రాజంపాలెంలో వైసీపీ నాయకులకు పైత్యం ముదిరిందంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా భావిస్తూ గుడి నిర్మాణానికి వైసీపీ నాయకుడొకరు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. తమ నాయకుడిని దైవాంశ సంభూతుడిగా కొలిచేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమి దగ్గర సీఎం జగన్‌ గుడి నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. ఇది చూసిన రాజంపాలెం గ్రామస్తులు ముక్కున వేలు వేసుకుని.. వైసీపీ నేతలకు పైత్యం ముదిరిందంటూ సెటైర్లు వేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement