అసంతృప్తుల రాజీనామాలు ప్రచారమే: Sajjala

ABN , First Publish Date - 2022-04-11T17:09:34+05:30 IST

మంత్రి పదవులు రాని అసంతృప్తి నేతలు రాజీనామాలు చేస్తున్నారనేది ప్రచారమే అని ప్రభుత్వ సలాహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

అసంతృప్తుల రాజీనామాలు ప్రచారమే: Sajjala

అమరావతి: మంత్రి పదవులు రాని అసంతృప్తి నేతలు రాజీనామాలు చేస్తున్నారనేది ప్రచారమే అని ప్రభుత్వ సలాహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. అధికారమనేది పవర్‌ కాదు.. బాధ్యత అని తెలిపారు. తమ వాళ్ల అసంతృప్తి తాత్కాలికమే అని అన్నారు. అసంతృప్త నేతలతో సీఎం కూడా మాట్లాడతారని, అందరి అపోహలను తొలగించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. కేబినెట్‌లో బీసీలకు పెద్దపీట వేశామన్నారు. మంత్రి పదవిరాని వారికి బాధ ఉంటుందని,  లేని అసమ్మతిని చూపించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. 


Updated Date - 2022-04-11T17:09:34+05:30 IST