Abn logo
Mar 4 2021 @ 13:52PM

ఇలాంటి సీఎంను నా రాజకీయ జీవితంలో చూడలేదు: రామచంద్రయ్య

అమరావతి: ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు వైసీపీ అభ్యర్థి సి.రామచంద్రయ్య కృతజ్ఞతలు తెలియాజేశారు. ఇచ్చిన మాటను ఈ స్థాయిలో నిలబెట్టుకునే సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. పెద్దల సభ ప్రతిష్టను పెంచేలా నడుచుకుంటామని తెలిపారు. ప్రతిపక్ష నేత వ్యవహరం సరిగా లేదని...సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు వ్యవహరించిన తీరుతో విశ్వసనీయత కొల్పోయారని విమర్శించారు. పార్టీ ప్రతిష్టను పెంచేందుకు రాబిన్ శర్మను తెచ్చుకున్నారన్నారు. చంద్రబాబుకు లేని విశ్వసనీయతను రాబిన్ శర్మ ఎలా తీసుకురాగలరు అని ప్రశ్నించారు. టీడీపీకి అభ్యర్ధులే దొరకడం లేదని అన్నారు. 85 శాతానికంటే ఎక్కువగా పంచాయతీలు గెలిచామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారన్నారు. ప్రతిపక్షం కూడా బాధ్యతతో వ్యవహరించాలని హితవుపలికారు. చంద్రబాబు, లోకేష్ ఉంటే పార్టీ మనుగడ ఉండదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సభల్లోనే జూనియర్ ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి తేవాలని నినాదాలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబైనా లోకేష్‌ను పార్టీ నుంచి పంపాలని.. లోకేషైనా చంద్రబాబుని పార్టీ నుంచి పంపాలని రామచంద్రయ్య వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement