Abn logo
Sep 28 2021 @ 22:33PM

టీడీపీలో వైసీపీ నేత చేరిక

మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ సమక్షంలో చేరిన పంట్రాంగం వసంతకుమార్‌

వాకాడు, సెప్టెంబరు 28 : మండలంలోని బుర్లవారిపాళెం గ్రామానికి చెందిన  కీర్తిశేషులు పంట్రాంగం కల్యాణ్‌ సోదరుడు పంట్రాంగం వసంతకుమార్‌ మంగళవారం మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ సమక్షంలో టీడీపీలో చేరాడు. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ వసంతకుమార్‌కి పార్టీలో సముచితస్థానం కల్పించేలా అధిష్ఠానంతో మాట్లాడుతామన్నారు. వసంతకుమార్‌  మాట్లా డుతూ మండలంలో బడుగు, బలహీన వర్గాలకు వైసీపీ నాయకులు సముచితస్థానం కల్పించడం లేదన్నారు. టీడీపీలో ఎస్సీలకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.  కార్యక్రమంలో  టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి దోశకాయల కృష్ణమూర్తి, తిరుపతి పార్లమెంట్‌ మత్స్యకార ఉపాధ్యక్షుడు మామిడి గోవిందయ్య, మండల ఎస్సీసెల్‌ అధ్యక్షుడు తీపలపూడి రమణయ్య, ఆ గ్రామ యువకులు పాల్గొన్నారు.