అనంతపురం: జిల్లాలోని గుంతకల్లులో గోశాల స్థలంపై వైసీపీ నేత హుస్సేన్ (Hussein) కన్నుపడింది. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పేరిట గోశాల నిర్వాహకుడు లక్ష్మీనారాయణకు తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. గోశాల స్థలం విడిచిపెట్టి వెళ్లకపోతే జేసీబీతో కూల్చి వేస్తానంటూ హెచ్చరించాడు. అంతేకాదు.. ‘‘నా సంగతి నీకు తెలియదు... నా పని నేను చేసేస్తా.. నేను అల్లా టప్పా మనిషిని కాదు. అడ్డం... నిలువునా పడుకున్నా సరే గోశాల స్థలం విడిచిపెట్టి వెళ్లకపోతే జేసీబీతో కూల్చేస్తా’’ అంటూ హుస్సేన్ ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన అర్చకుడు లక్ష్మీనారాయణ.. గోశాలను కాపాడాలంటూ వేడుకుంటున్నాడు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు ఇప్పటి వరకూ స్పందించకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి