Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ వీడి టీడీపీలో చేరిక

  1. ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బీసీ


కోవెలకుంట్ల, డిసెంబరు 5: అధికార వైసీపీని వీడి సౌదరదిన్నె గ్రామానికి చెందిన 150 కుటుంబాలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదని బీసీ అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలను పెంచి సామాన్యుల జీవితాలను సీఎం జగన్‌ దుర్భరంగా మార్చారని అన్నారు. సౌదరదిన్నె వైసీపీ నాయకులు దస్తగిరి, పక్కీర్‌షాలతో కలిసి 150 కుటుంబాల వారు పార్టీని వీడారు. గ్రామానికి చేరుకున్న బీసీకి గ్రామస్థులు మేళతాళాలతో ఎదురువెళ్లి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ పాదయాత్ర చేసి ‘నేను ఉన్నాను, నేను విన్నాను’ అని ప్రజలను నమ్మించారని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలకు కూడా సంక్షేమ పథకాలు అందడం లేదని, అందుకే సౌదరదిన్నెలో 150 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, మళ్లీ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు అమడాల మద్దిలేటి, సౌదరదిన్నె సుబ్బారెడ్డి, నియోజకవర్గ నాయకులు అభిరుచి మధు, వల్లంపాడు ఉప సర్పంచ్‌ గార్లపాటి జగదీశ్వరరెడ్డి, వెలగటూరు ధనుంజయుడు, చిన్నకొప్పెర్ల మాజీ సర్పంచ్‌ బుచ్చన్న, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల నాయుడు, ఏవీ సుబ్బారెడ్డి, ఆల్వకొండ విష్ణుశేఖర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement