వైసీపీ నాయకుల దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-10-19T06:40:51+05:30 IST

అధికార వైసీపీ నాయకులు రెచ్చిపోయి నగరంలోని 44వ సచివాలయ వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీపై దాడి చేశారు. ఆగ్రహంతో కంప్యూటర్‌ పగులకొట్టారు. ఈ సంఘటనలో ఓ కార్పొరేటర్‌ కుటుంబం హల్‌చల్‌ చేసింది.

వైసీపీ నాయకుల  దౌర్జన్యం

వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీపై దాడి

చేదోడు  పథకం అక్రమంగా వర్తింపజేయలేదనే !

44వ సచివాలయంలో కార్పొరేటర్‌ కుటుంబం హల్‌చల్‌


అనంతపురం కార్పొరేషన, అక్టోబ రు18: అధికార  వైసీపీ నాయకులు రెచ్చిపోయి నగరంలోని 44వ సచివాలయ వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీపై దాడి చేశారు. ఆగ్రహంతో కంప్యూటర్‌ పగులకొట్టారు. ఈ సంఘటనలో ఓ కార్పొరేటర్‌ కుటుంబం హల్‌చల్‌ చేసింది. నగరంలోని 44వ సచివాలయంలో 26వ డివిజన కార్పొరేటర్‌ మీనాక్షి, ఆమె కుమారు డు నాగార్జునరెడ్డి, స్టోర్‌ డీలర్‌ చెన్నారెడ్డి వీరం గం సృష్టించారు. దుర్భాషలాడుతూ తనపై  దాడికి పాల్పడ్డారని బాధిత ఉద్యోగి రమేష్‌ వాపోయాడు. ‘నాపై దాడి చేశారు. కంప్యూటర్‌ పగలకొట్టారు. పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేస్తామని చెబితే వైసీపీ నాయకుడు, స్టోర్‌డీలర్‌ చెన్నారెడ్డి భీకరంగా కం ప్లైంట్‌ ఈపోలే అంటూ రెచ్చిపోయారు’. అంటూ మాట్లాడిన వీడియో వైరల్‌ అయింది. కుట్టుమిషనకే జగనన్న చేదోడు ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడమే ఈ వివాదానికి కారణమని సచివాలయ వర్గాలంటున్నాయి. 


కుట్టుమిషన ఉంటే చేదోడు కావాలట...

జగనన్న చేదోడు సంక్షేమ పథకం కింద టైలర్‌షాప్‌ (దుకాణం) ఉండి, జీఎస్టీ చెల్లిస్తున్నవారు మాత్రమే అర్హులు. కానీ 44వ సచివాలయంలో హుస్సేనబేగం పేరుతో ఓ దరఖాస్తు అందింది. అయితే అక్కడ దుకాణం లేదు. కేవలం కుట్టుమిషన ఉంచి ఆ గది ముందు దుకాణం ఉన్నట్లు ఫ్లెక్సీ వేయించుకుంటారట. ఆ గదిని ఫొటో తీసి చేదోడుకు దరఖాస్తు చేసి అర్హురాలిగా గుర్తించాలని కార్పొరేటర్‌ మీనాక్షి కుటుంబం డిమాండ్‌ చేసినట్లు రమేష్‌ తెలిపారు. ఈ విషయంలో మూడురోజుల క్రితం ఎమ్మెల్యే పిలుస్తున్నారు రావాలని చెప్పారట. తనకెలాంటి సమాచారం లేదని, రాలేనని రమేష్‌ చెప్పారు. సోమవారం కార్పొరేటర్‌ మీనాక్షి, ఆమె కుమారుడు నాగార్జునరెడ్డి, స్టోర్‌ డీలర్‌ చెన్నారెడ్డిలు సచివాలయంలోకి వచ్చి రావడంతోనే తనపై దాడి చేశారని రమేష్‌ వాపోయారు. అనంతరం కంప్యూటర్‌ను పగలకొట్టారన్నారు. 


కేసులు పెట్టి రిస్క్‌ తీసుకుంటారా...?

సచివాలయ సిబ్బందిపై దాడి జరగడం ఇది కొత్తేమీ కాదు. రెండు నెలల క్రితం 60వ సచివాలయంలో వార్డు అడ్మినపై దాడి చేశారు. అంతకుముందు 36వ సచివాలయంలోనూ కార్పొరేటర్‌ సంబంధీకులు హల్‌చల్‌ చేశారు. 58వ సచివాలయంలోనూ అదే పరిస్థితి. ఇక దాడి విషయంపై సీరియ్‌సగా స్పందించాల్సిన కార్పొరేషన అధికారులు ఏమీపట్టనట్లు వ్యవహరించడం గమనార్హం. కేసులు పెట్టి  మీ ఉద్యోగాలకు రిస్క్‌ తీసుకుంటారా...? అంటూ హితవు పలికినట్లు సమాచారం. టూటౌన పోలీస్‌ స్టేషనలో సైతం సచివాలయ ఉద్యోగులు కేసు పెట్టడానికి వెళితే సరిగా స్పందించలేదని వారు వాపోతున్నారు. ఫిర్యా దు చేయడం ఇలా కాదంటూ పలుసార్లు రాయించినట్లు ఆరోపించారు. 


పని మనుషుల్లా చూస్తున్నారు :  రమేష్‌, 44వ వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీ

టైలర్‌షాప్‌ కింద దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి దుకాణం లేదు. కేవలం ఫ్లెక్సీ వేసుకుని ఫొటో తీసుకోమన్నారు. నిబంధనలకు విరుద్ధమని వీలుకాదన్నాం. ఎమ్మెల్యే పిలుస్తున్నారని చెప్పారు. ఆయన రమ్మని చెప్పలేదు. ఆఫీ్‌సలోకి వచ్చీరాగానే చెంపపై కొట్టారు. కంప్యూటర్‌ పగలకొట్టారు. దుర్భాషలాడారు. మేమేమైనా వారికి అసిస్టెంట్లమా...? పని మనుషుల్లా చూస్తున్నారు. కొన్ని సచివాలయాల్లో సిబ్బందిపై చేయిచేసుకుంటున్నారు. ఇలాంటప్పుడు అధికారుల మద్దతు ఇవ్వాలి. కానీ వారు ముందుకు రావడం లేదు. ఆ విధానం మారాలి. మున్సిపల్‌ ఆఫీ్‌సకు రమ్మంటారు. వచ్చి ఏం మాట్లాడాలి.


Updated Date - 2021-10-19T06:40:51+05:30 IST