Abn logo
Sep 27 2021 @ 01:06AM

వైసీపీది రెండు నాల్కల ధోరణి

సమావేశంలో మాట్లాడుతున్న సందిరెడ్డి శ్రీనివాసులు



- ఢిల్లీలో జైకొట్టి... రాష్ట్రంలో విభేదిస్తోంది 

: బీజేపీ నాయకుడు సందిరెడ్డి శ్రీనివాసులు

అనంతపురం అర్బన, సెప్టెంబరు 26: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లులకు ఓ టేసి  రాష్ర్టానికి వచ్చేసరికి వ్యతిరేకిస్తూ వైసీపీ రెండు నాల్కుల ధోరణి అవలంభి స్తోందని అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు మం డిపడ్డారు. ఆదివారం ఆయన తన నివాసంలో  మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం ప్రతిపక్షాలు భారత బంద్‌కు పిలుపునిచ్చా యన్నారు. రైతు శ్రేయస్సుకోసం కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకువస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్‌, వామపక్షాలు రైతుల అభివృద్ధిని అడ్డుకుంటున్నా యన్నారు. వైసీపీ బీజేపీకి ఢిల్లోలో జైకొట్టి రాష్ట్రంలో విభేదించడం బాధాకరమన్నారు.  కార్యక్రమంలో నాయ కులు రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.