మైనార్టీలకు వైసీపీ తీవ్ర మోసం

ABN , First Publish Date - 2022-06-26T06:10:58+05:30 IST

తెలుగుదేశం పార్టీ హయాంలో మైనార్టీలకు అందే పథకా లన్నీ రద్దుచేసి వైసీపీ ప్రభుత్వం వారిని నిండామోసం చేసిందని టీడీపీ మైనార్టీ విభాగం పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి నాగూర్‌హుస్సేన, నియోజకవర్గ అధ్యక్షుడు అత్తర్‌ రహీంబాషా మండిపడ్డారు.

మైనార్టీలకు వైసీపీ తీవ్ర మోసం
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ మైనార్టీ నాయకులు




 ఓట్ల కోసం వాడుకుంటున్నారు: టీడీపీ మైనార్టీ నాయకులు

ధర్మవరం, జూన 25: తెలుగుదేశం పార్టీ హయాంలో మైనార్టీలకు అందే పథకా లన్నీ రద్దుచేసి వైసీపీ ప్రభుత్వం వారిని నిండామోసం చేసిందని టీడీపీ మైనార్టీ విభాగం పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి నాగూర్‌హుస్సేన, నియోజకవర్గ అధ్యక్షుడు అత్తర్‌ రహీంబాషా మండిపడ్డారు.  టీడీపీ స్థానిక కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాకమునుపు మైనార్టీలకు అనేక వాగ్దానాలను గుప్పిం చి నేడు వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలంచెందారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో మైనార్టీల సంక్షేమం కోసం అందించే దుల్హన, దుకాన మకాన తదితర పథకాలన్నిటినీ నిలిపివేయడం దారుణమన్నారు. దుల్హన పథకానికి  రూ. లక్ష ఇస్తామని చెప్పి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన సీఎం జగన  తరువాత మొండిచేయి చూపారంటూ మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో మైనార్టీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమపథకాలను రద్దుచేశారన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు నిత్యావసర వస్తువుల ఽధరలు పెంచేచి సామాన్యుల నెత్తిన గుదిబండ వేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో  మైనార్టీలు జగనకు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీనాయకులు రాళ్లపల్లి షరీఫ్‌, షమీర్‌, క్రిష్ణాపురం జమీర్‌అహమ్మద్‌, బాబూఖాన, షాషా, కుళ్లాయప్ప, ఇమ్రాన, ఇర్షాద్‌, బాబావలి,మాబు, హుస్సేన, షఫీ, బాబావలి పాల్గొన్నారు.

ముస్లింలకు ప్రభుత్వం మొండిచేయి : కాంగ్రెస్‌

కదిరి అర్బన, జూన 25: ముస్లింలకు గత  ప్రభుత్వం అమలు చేసిన పథకాలను పూర్తిగా నిలిపివేసిసి,  వైసీపీ ప్రభుత్వం మొండిచేయి చూపిందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇందాదుల్లాఖాన శనివారం ఓప్రకటనలో  పేర్కొన్నారు. జగనకు గత ఎన్నికల్లో ముస్లిలు అండగా నిలిచారని, ఆయన ముఖ్యమంత్రి అయినతే హామీలు నెరవేరతాయని ఆశించారు. అయితే గడిచిన మూడేళ్లలో కొత్త పథకాలు ప్రకటించ కుండా ఉన్నపథకాలు నిలిపివేశారన్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ముస్లిం యువతకు దుల్హాన పథకం ప్రారంభించారన్నారు. దీని ప్రకారం పేద ముస్లిం యువతకు వివాహ సమయంలో రూ.50వేలు అందిచేవారన్నారు. జగన అదికారంలోకి వచ్చిన తరువాత ఆపథకాన్ని వైఎస్‌ఆర్‌ దుల్హాన పథకంగా మారుస్తూ, రూ.లక్షకు పెంచనున్నట్లు ప్రకటిం చారన్నారు. తరువాత ఈపథకం గురించి ఊసే లేదని, మిగిలిన పథకాలనూ కొనసాగించకుండా సీఎం జగన ముస్లింలను మోసం చేశారన్నారు. 

Updated Date - 2022-06-26T06:10:58+05:30 IST