రైతులకు వైసీపీ అన్యాయం

ABN , First Publish Date - 2021-06-19T05:52:03+05:30 IST

రైతుల ప్రభుత్వమంటూ ఊదరగొడుతున్న వైసీపీ, అన్నదాతలకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నదని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగురైతు ప్రధానకార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి మండి పడ్డారు.

రైతులకు వైసీపీ అన్యాయం
మాట్లాడుతున్న ఉగ్గిన రమణమూర్తి

పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి

కశింకోట, జూన్‌ 18:
రైతుల ప్రభుత్వమంటూ ఊదరగొడుతున్న వైసీపీ, అన్నదాతలకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నదని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగురైతు ప్రధానకార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి మండి పడ్డారు. ఉగ్గినపాలెంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రూ.3670 కోట్లు బకాయిలు పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రైతులకు మేలు చేశామంటూ చెబుతున్న విషయాల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. గ్రోయిన్లు, పంట కాలువల మరమ్మతులకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కౌలు  రైతులకు ప్రభుత్వం రాయితీలు అందించడంలో విఫలమైందన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-06-19T05:52:03+05:30 IST