ఉద్యోగులపై వైసీపీ కక్షసాధింపు

ABN , First Publish Date - 2022-08-13T06:11:23+05:30 IST

ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తాం.. సీపీఎస్‌ రద్దుచేస్తాం అంటూ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన సీఎం జగన నేడు అదే ఉద్యోగులపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని తెలుగు యువత, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగులపై వైసీపీ కక్షసాధింపు
జేఎనటీయూ గేట్లు ఎక్కుతున్న టీఎనఎస్‌ఎఫ్‌, తెలుగు యువత నాయకులు

జేఎనటీయూను ముట్టడించిన తెలుగుయువత, టీఎనఎ్‌సఎ్‌ఫ

నాయకుల అరెస్ట్‌, విడుదల

అనంతపురం సెంట్రల్‌, ఆగస్టు 12: ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తాం.. సీపీఎస్‌ రద్దుచేస్తాం అంటూ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన సీఎం జగన నేడు అదే ఉద్యోగులపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని తెలుగు యువత, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఎనటీయూలో కులరాజకీయాలు చేస్తూ ఉద్యోగులు, సిబ్బంది లక్ష్యంగా బదిలీలు, సస్పెండ్‌లతో వైసీపీ ప్రభుత్వం భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ శుక్రవారం యూనివర్సిటీని ముట్టడించారు. ఈ సందర్భంగా  నాయకులు తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, ప్రధానకార్యదర్శి గడుపూటి నారాయణస్వామి మాట్లాడుతూ వర్సిటీ యాజమాన్యం అధికారమదంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. కలికిరి ఇంజనీరింగ్‌ కళాశాల సూపరింటెండెంట్‌ ఎండీ నాగభూషణంను అకారణంగా సస్పెండ్‌ చేశారన్నారు. ఉద్యోగులు వారి హక్కులను ప్రశ్నించడాన్ని వైసీపీ నేరంగా భావిస్తోందన్నారు. పాలనా వ్యవహారాల్లో సంబంధంలేని వైసీపీ సామాజిక వర్గానికిచెందిన కొందరు అధికారులు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారన్నారు. బీసీ ఉద్యోగి ఎండీ నాగభూషణాన్ని సస్పెండ్‌ చేసిన వీసీపై చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఆందోళన చేస్తున్న నాయకులను దిశ పోలీ్‌సస్టేషన డీఎస్పీ అర్ల శ్రీనివాసులు అధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి సుధాకర్‌ యాదవ్‌, రాష్ట్ర నాయకులు లక్ష్మీనరసింహ, టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురాం, అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు గుత్తా ధనుంజయ నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్‌ యాదవ్‌, నగర అధ్యక్షుడు బొమ్మినేని శివ, హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు కురవ జగదీష్‌, నాయకులు గోనుగుంట్ల శ్రీనివాస్‌ చౌదరి, మిడుతూరి హరీ్‌షరెడ్డి, కందుకూరి మురళీ, పెద్దన్న, భరత చౌదరి, ప్రశాంత చౌదరి, ఓబుల్‌రెడ్డి, గంగాధర, ఎర్రమనాయుడు, తలారి సాయి, బోయ అనీల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T06:11:23+05:30 IST