దళిత మహిళా డాక్టర్ ను వేధించడం దారుణం: లోకేష్

ABN , First Publish Date - 2020-06-07T03:32:59+05:30 IST

దళిత మహిళా డాక్టర్ ను వేధించడం దారుణం: లోకేష్

దళిత మహిళా డాక్టర్ ను వేధించడం దారుణం: లోకేష్

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గోల్డ్ మెడల్ సాధించి డాక్టర్ అయిన ఒక దళిత బిడ్డపై వైసీపీ గుండాల దాష్టికం పెరిగిందని లోకేష్ విమర్శించారు. జగన్ అమలు చేస్తున్న రాజా రెడ్డి రాజ్యాంగంలో దళిత బిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని లోకేష్ మండిపడ్డారు. వైసీపీ నేతల అవినీతికి సహకరించలేదని దళిత మహిళా డాక్టర్ అనితా రాణిని వేధించడం దారుణమని లోకేష్ అన్నారు. మీ దిశ చట్టం దిశ తప్పిందా? అని, అన్యాయం జరిగింది అంటూ ఒక దళిత చెల్లెలు పోలీస్ స్టేషన్ కి వెళితే దిశ చట్టం నిందితులకు కొమ్ముకాయడం ఘోరమన్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరు ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఈ ఘటన పై సమగ్ర విచారణ జరపాలని లోకేష్ డిమాండ్ చేశారు. నిజాయితీగా వృత్తి ధర్మానికి కట్టుబడినందుకు బూతులు తిడుతూ, ఫోటోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-06-07T03:32:59+05:30 IST