పడవ కార్మికుల కంట్లో ఇసుక!

ABN , First Publish Date - 2022-05-17T06:58:09+05:30 IST

కొవ్వూరు, మే 16: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఇసుక కార్మికులకు శాపమైంది. అన్ని ర్యాంపులను ఓ ప్రైవేట్‌ సంస్థకు కేటాయించడంతో వేలాదిమంది కార్మికులకు ఉపాధి పోయింది. దీంతో సుమారు 25 వేల మంది కార్మిక కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓపెన్‌, డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో టన్ను ఇసుక ధరలో వ్యత్యాసాల కారణంగా డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. గోదావరి పరీవాహక

పడవ కార్మికుల కంట్లో ఇసుక!
కొవ్వూరు సమీపంలోని డీసిల్టేషన్‌ ర్యాంపులో పేరుకున్న ఇసుక నిల్వలు

బోట్స్‌మన్‌ సొసైటీలను దెబ్బతీసిన ప్రభుత్వం 

కొవ్వూరు గోదావరి వైపు రోడ్డున పడ్డ 25 వేల కుటుంబాలు

గత ఆరు నెలలుగా పనిలేక కార్మికులకు అష్టకష్టాలు

సీజన్‌లోనూ ఉపాధి లేదు.. తమను ఆదుకోవాలని డిమాండు

కొవ్వూరు, మే 16: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఇసుక కార్మికులకు శాపమైంది. అన్ని ర్యాంపులను ఓ ప్రైవేట్‌ సంస్థకు కేటాయించడంతో వేలాదిమంది కార్మికులకు ఉపాధి పోయింది. దీంతో సుమారు 25 వేల మంది కార్మిక కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓపెన్‌, డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో టన్ను ఇసుక ధరలో వ్యత్యాసాల కారణంగా డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలోని డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో గత ఆరు నెలలుగా ఇసుకతీత నిలి చిపోవడంతో ఉపాధి కోల్పోయిన పడవ కార్మికులు రోడ్డునపడ్డారు. ఇసుక తీసే సుమారు వెయ్యి పడవలు ఎక్కడికక్కడ ఒడ్డుకు చేరాయి. ఒక ప్రైవేట్‌ సంస్థ ఇసుక ర్యాంపుల నిర్వహణ చేపట్టిన నాటినుంచి పడవల ద్వారా ఇసుక తవ్వకాలు చేపట్టే ర్యాంపులు పట్టుమని నెలరోజులు కూడా కొనసాగలేదు. టన్ను ఇసుక ధర ఓపెన్‌ర్యాంపుల్లో రూ.475, డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో రూ.625 నిర్ణయించారు. ధర తక్కువగా ఉండడంతో వినియోగదారులు ఓపెన్‌ ర్యాంపుల వైపే మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో నది నుంచి పడవల ద్వారా తవ్వకాలు జరిపి ఒడ్డుకు తీసుకువచ్చిన ఇసుక ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చివరకు వినియోగదారులు రాకపోవడంతో డీసిల్టేషన్‌ ర్యాంపులు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చిన్న నిర్ణయంతో వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. గోదావరి తీరంలోని విజ్జేశ్వరం నుంచి పోలవరం వరకు ఏటిగట్టు పొడవునా సుమారు 30 వరకు డీసిల్టేషన్‌ ఇసుక ర్యాంపులున్నాయి. ఈ ర్యాంపుల్లో వెయ్యిమందికి చెందిన పడవల ద్వారా తవ్వకాలు చేపడుతుంటారు. ఒక్కో పడవపై పది మంది కార్మికులు పనిచేస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. ఈ విధానంలో గోదావరి నదిలో మునిగి ఇసుక తవ్వి పడవల ద్వారా ఒడ్డుకు తీసుకువచ్చి విక్రయాలు చేపట్టేవారు. ప్రభుత్వం ఇసుక పాలసీ పేరు తో ఇసుక ర్యాంపులను ఒక ప్రైవేట్‌ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ టన్ను ఇసుకకు ధర నిర్ణయించింది.


ఓపెన్‌ ర్యాంపులు, డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో టన్ను ఇసుక ధరలో వ్య త్యాసాలతో 2021 నవంబర్‌ నుంచి డీసిల్టేషన్‌ ఇసుక ర్యాంపులు మూతపడ్డాయి. దీంతో ర్యాంపుల్లో తవ్వకాలు చేపట్టే కార్మికులు ప్రత్యక్షంగా 15 వేలు, పరోక్షంగా మరో 10 వేలు కలిపితే సుమారు 25 వేల కుటుంబాలు గత ఆరు నెలలుగా ఉపాధి లేక వారందరి జీవనోపాధి దెబ్బతింది. వాస్తవానికి గతంలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ సమయంలో ఒపెన్‌, డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో ఇసుకకు ఒకే ధర ఉండేది. ప్రభు త్వం నూతన ఇసుక పాలసీ పేరుతో ప్రైవేట్‌ సంస్థకు ర్యాంపులను గుత్తగా ఇచ్చింది. దీంతో ఓపెన్‌ర్యాంపుల్లో ఇసుక ధర టన్ను రూ.475, డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో రూ.625 నిర్ణయించారు. దీంతో మూడు యూనిట్ల లారీ ఇసుక ఓపెన్‌ ర్యాంపులో రూ.4,750 (లారీ కిరాయి అదనం) అదే డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో రూ.6,250 అవుతుంది. మూడు యూనిట్ల లారీ ఇసుకకు రూ.1500 వ్యత్యాసం రావడంతో వినియోగదారులు, లారీ యజమాను లు ఓపెన్‌ ర్యాంపుల వైపే మోగ్గుచూపుతున్నారు. దాంతో పడవల్లో నదిలోకి వెళ్లి ఒడ్డుకు చేర్చిన ఇసుక ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కార్మికుల ఉపాధి దెబ్బతింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు కూడా ఉపాధి లేక వెనుదిరగడంతో ర్యాంపు ల్లో గత కొద్దినెలలుగా ఇసుక తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. 


ఆందోళన బాట పట్టినా..

వేలాదిమంది ఉపాధితో ముడిపడి ఉన్న బోట్స్‌మన్‌ సొసైటీల ర్యాంపులను నిర్లక్ష్యం చేయడంతో కార్మికుల జీవనోపాధి ప్రశ్నార్థకమైంది. తమ సమస్యలను పరిష్కరించా లని పడవ యజమానులు ఆందోళనలు కూడా చేశారు. డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో పడవల ద్వారా నది నుంచి ఒడ్డుకు చేర్చిన టన్ను ఇసుకకు ప్రైవేటు సంస్థ రూ.214 చొప్పున వారానికి ఒకసారి అందించేది. ఓపెన్‌ ర్యాంపుల్లో అయితే లారీ నేరుగా ఇసుక వద్దకు వెళ్లిపోవడంతో యంత్రాలతో లోడ్‌ చేసి పంపించి వేస్తున్నారు. ఈ క్రమంలో డీసిల్టేషన్‌ ర్యాంపులను పట్టించుకోవడం మానేసింది. దీంతో నెలల తరబడి ఆందోళనలు చేసినా ఫలితం మాత్రం లేదు. అటు గోదావరికి వరదొస్తే మూడు నెలలపాటు ఇసుక తవ్వకా లు పూర్తిగా నిలిచిపోతాయి. ఇప్పటివరకు కాంట్రాక్టు సంస్థగాని, ప్రభుత్వంగాని ఇసుక ధర తగ్గించే విషయంలో ఎటువంటి నిర్ణయానికి రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి బోట్స్‌మన్‌ సొసైటీల సమస్యలను పరిష్కరించడంతోపాటు ఓపెన్‌, డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో టన్ను ఇసుకకు ఒకే ధర నిర్ణయించాలని కార్మికులు కోరుతున్నారు. 


కార్మికులు ఉపాధి కోల్పోయారు..

డీసిల్టేషన్‌ ర్యాంపులు మూతపడడంతో వేలాదిమంది కార్మి కులు ఉపాధి కోల్పోయారు. నా పడవపై పది మంది కార్మికులకు ఉపాధి దొరికేది. ఓపెన్‌ ర్యాంపుల వద్దే అమ్మకాలు జరగడంతో కార్మికులు వేరే పనులను వెతుక్కోవలసి వస్తోంది. 

        - పాకా జయరామ్‌, పడవ యజమాని, కొవ్వూరు

Updated Date - 2022-05-17T06:58:09+05:30 IST