వైసీపీ అభిమానులకూ పేరు మార్పు నచ్చలేదు

ABN , First Publish Date - 2022-09-23T09:06:22+05:30 IST

వైసీపీ అభిమానులకూ పేరు మార్పు నచ్చలేదు

వైసీపీ అభిమానులకూ పేరు మార్పు నచ్చలేదు

సినీ నిర్మాత అంబికా కృష్ణ

తిరుమల, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును అలానే ఉంచాలని ప్రముఖ సినీ నిర్మాత, టీడీపీ నేత అంబికా కృష్ణ కోరారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని గురువారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చడంపై టీడీపీ అభిమానుల అభిప్రాయాన్ని పక్కన పెడితే వైసీపీ అభిమానులకు కూడా నచ్చలేదన్నారు. సీఎం జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాధాకరమన్నారు. దయచేసి ఎన్టీఆర్‌ పేరును అలానే ఉంచాలని సీఎంను అభ్యర్థిస్తున్నానని అన్నారు.

Updated Date - 2022-09-23T09:06:22+05:30 IST