Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డికి చేదు అనుభవం

అనంతపురం: బెలుగుప్ప మండలంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జీడిపల్లిలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. వరద బాధితులకు ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం కింద అందిస్తున్న పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతుండగా కొంతమంది మహిళలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు గందరగోళం ఏర్పడింది. ఇందులో కొంతమందికి రాకపోవడంతో మహిళలు విశ్వేశ్వర్‌రెడ్డి‌ని తమకెందుకు రాలేదని ప్రశ్నించారు. మూడేళ్లకు  తమ గ్రామం గుర్తుకు వచ్చిందా అంటూ కొంతమంది  నిలదీశారు. అర్జీలు ఇస్తే అందరికీ అందేలా చూస్తామని చెప్పడంతో శాంతించారు.

Advertisement
Advertisement