అమరావతి: వైసీపీ (YCP) పాలనలో వ్యవసాయానికి సాయం తగ్గిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను కులాల పేరుతో వైసీపీ ప్రభుత్వం విభజిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో సాగుబోర్లకు మీటర్లు బిగిస్తున్నారని తప్పుబట్టారు. రాయితీలు ఇవ్వడం ఎందుకు?.. మీటర్లు బిగించడం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్రలో భాగంగానే మీటర్లు బిగిస్తున్నారని దుయ్యబట్టారు. ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఆర్‌బీకేల పేరుతో రైతులను దోచుకుంటున్నారని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి