Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన’

రాంబిల్లి, డిసెంబరు 5: ఒక్క అవకాశం అంటూ.. ప్రజలను ప్రాఽథేయ పడిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రస్తు తం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తు న్నారని టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని లోవపాలెం, రాజుకోడూరు శివారు వాడనర్సాపురం గ్రామాల్లో ఆదివారం ఏర్పాటైన ఆత్మగౌ రవ సభలో మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాటలో పయనించి, అంతా సుఖశాంతు లతో ఉండాలంటే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ధూళి రంగనాయకులు, మండల శాఖ అధ్యక్షుడు వి.దిన్‌బాబు, నాయకులు ఎరిపిల్లి చిట్టిబాబు, కశిరెడ్డి ప్రసాద్‌, చోడిపల్లి మంగరాజు, చెల్లూరి ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement