Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫ్యాక్షనిస్టు తరహాలో వైసీపీ దాడులు

వైసీపీ దాడులకు నిరసనగా బుచ్చిలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ

బుచ్చిలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ 


బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు 21: తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై వైసీపీ గూండాలు ఉగ్రవాదులు, ఫ్యాక్షనిస్టు తరహాలో దాడులు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడులకు నిరసనగా గురువారం బుచ్చిరెడ్డిపాళెంలోని టీడీపీ కార్యాలయం నుంచి  చెన్నూరు రోడ్డు మీదుగా బస్టాండ్‌ కూడలి వరకు పోలంరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ గూండాలు టీడీపీ కార్యాలయాలపై, నేతలపై దాడులు చేస్తుంటే.. సీఎం జగన్మోహన్‌రెడ్డి, హోంమంత్రి, డీజీపీ దాడులను ఖండించకపోగా తిరిగి టీడీపీ వాళ్లు సీఎంను తిట్టారనే నెపంతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే పోలీసుల వైఫల్యం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే, మీ దుర్మార్గాలకు భయపడే పరిస్థితే లేదన్నారు. నగర పంచాయతీని   కూడా కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంవీ. శేషయ్య, బి.హరికృష్ణ, ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి, కావలి వెంకటేశ్వర్లు, హరనాథ్‌, ఉసురుపాటి ప్రసాద్‌, బండ్ల కొండయ్య, వి.శ్రీనివాసులు, పెంచలయ్య, మహేష్‌నాయుడు, దశరథ, కృష్ణచైతన్య,  శ్రీను, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement