Jaganకు షాకిచ్చిన సొంత పార్టీ నేత.. ఏకంగా అధినేత నిర్ణయానికే ఎదురుతిరిగాడుగా..!

ABN , First Publish Date - 2022-05-14T19:52:05+05:30 IST

‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’ అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై బొబ్బిలి వైసీపీ కౌన్సిలర్ రామారావు నాయుడు ఎదురు తిరిగారు.

Jaganకు షాకిచ్చిన సొంత పార్టీ నేత.. ఏకంగా అధినేత నిర్ణయానికే ఎదురుతిరిగాడుగా..!

విజయనగరం: ‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’ అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) తీసుకున్న నిర్ణయంపై బొబ్బిలి వైసీపీ కౌన్సిలర్ రామారావు నాయుడు(Rama naidu) ఎదురు తిరిగారు. అభివృద్ధి చేయకుండా గడప గడపకు ఎలా వెళ్లగలమని ప్రశ్నించారు. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గడప గడపకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లాలని నిలదీశారు. పేరుకే పథకాలు.. ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని మండిపడ్డారు. తమ బాధ పార్టీలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్ధితి ఏర్పడిందని రామారావు వాపోయారు. 

Read more