ఓట్ల తొలగింపు లక్ష్యంగా వైసీపీ కుట్రలు

ABN , First Publish Date - 2022-07-07T04:55:03+05:30 IST

ఓట్ల తొలగింపే లక్ష్యంగా వైసీపీ కుట్రలు పన్నుతుందని, క్షేత్ర స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మండల టీడీపీ అధ్యక్షుడు కఠారి నాగేశ్వరరావు అన్నారు. అద్దంకి మండల, పట్టణ టీడీపీ క్లష్టర్‌ ఇన్‌చార్జిలు, బూత్‌ కన్వీనర్ల సమావేశం బుధవారం స్థానిక పోతురాజుగండి వద్ద టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ మాట్లాడుతూ ఓట్ల చేర్పులు, తొలగింపులు పై ఎప్పటికప్పుడు సంబంధిత బూత్‌లెవల్‌ అధికారుల వద్ద సరిచూసుకోవాలన్నారు.

ఓట్ల  తొలగింపు లక్ష్యంగా వైసీపీ కుట్రలు
సమావేశమైన మండల, పట్టణ టీడీపీ నాయకులు

క్షేత్ర స్థాయిలో నాయకులు అ ప్రమత్తంగా ఉండాలి-కఠారి నాగేశ్వరరావు

అద్దంకి, జూలై6: ఓట్ల తొలగింపే లక్ష్యంగా వైసీపీ కుట్రలు  పన్నుతుందని, క్షేత్ర స్థాయిలో నాయకులు,  కార్యకర్తలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మండల టీడీపీ అధ్యక్షుడు కఠారి నాగేశ్వరరావు అన్నారు. అద్దంకి మండల, పట్టణ టీడీపీ క్లష్టర్‌ ఇన్‌చార్జిలు, బూత్‌ కన్వీనర్ల సమావేశం బుధవారం స్థానిక పోతురాజుగండి వద్ద టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంట్‌  టీడీపీ ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ మాట్లాడుతూ ఓట్ల చేర్పులు, తొలగింపులు పై ఎప్పటికప్పుడు సంబంధిత బూత్‌లెవల్‌ అధికారుల వద్ద సరిచూసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి ఓట్లు చేర్పించాలన్నారు. సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలన ను ప్రజలకు  వివరించాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు,  క్లస్టర్‌ ఇన్‌చార్జిలు కరి  పరమేష్‌, జొన్నలగడ్డ గోపి, రాజశేఖర్‌, మలాది నటరాజ్‌, కాకాని అశోక్‌, కుందారపు  రామారావు, కోనేటి అనిల్‌, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-07-07T04:55:03+05:30 IST