రాష్ట్రంలో అసంబద్ధ పాలన

ABN , First Publish Date - 2021-07-26T06:13:47+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అసంబద్ధ పాలన సాగుతోందని, ఆ పా లకులపై ప్రజల్లో వ్యతిరేకతన మొదలైందని టీడీపీ నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీల కుడు బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో అసంబద్ధ పాలన
మా ట్లాడుతున్న పరిశీలకుడు జనార్దన్‌రెడ్డి

వైసీపీపై ప్రజల్లో మొదలైన వ్యతిరేకత

టీడీపీ నెల్లూరు, ఒంగోలు  పార్లమెంట్‌ పరిశీలకుడు జనార్దన్‌రెడ్డి

ఎర్రగండపాలెం, జూలై 25 :  రాష్ట్రంలో వైసీపీ అసంబద్ధ పాలన సాగుతోందని, ఆ పా లకులపై ప్రజల్లో వ్యతిరేకతన మొదలైందని టీడీపీ నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీల కుడు బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. వై.పాలెం నియోజక వర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అధ్యక్ష తన ఆదివారం జరిగిన నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ నిజాయితీ కలిగిన ఉన్నతాధికారులు కోర్టులో జడ్జిల ఎదుట నిలబడాల్సి వస్తోంద న్నారు. టీడీపీలో క్రమశిక్షణ కలిగిన నాయ కు లు పుడుతుంటారని అన్నారు. ప్రస్తుతం అధికా రంలో ఉన్న జగన్‌ టీడీపీ ప్రభుత్వం నిర్మించిన అభివృద్ధి కట్టడాలను కూల్చే పనిలో ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు ప్రారంభిం చారన్నారు. ఒంగోలు పార్లమెంటరీ నియోజక వర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడు తూ అన్ని ప్రాంతాల్లో వైసీపీ పాలకులపై వ్యతి రేకతన మొదలైందన్నారు. సమావేశంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టరు మన్నె రవీంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ కరిముల్లా,  నియోజకవర్గ పరిశీలకుడు గోనుగుంట్ల  కోటేశ్వరరావు, ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, పయ్యావుల ప్రసాద్‌, అంబటి వీరారెడ్డి, వూట్ల సీతారామయ్య, వెంకటరెడ్డి, తెలుగు యువత నాయకులు చిన్నమల్లికార్జునాయుడు, ఐదుమండలాల మాజీ అధ్యక్షులు, గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు, సర్పంచులు, మా జీ ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సం ద ర్భంగా ఎరిక్షన్‌బాబుకు సహకరిస్తామని నాయ కులు పరిశీలకుడి వద్ద స్పష్టం చేశారు. 

వెలిగొండ పునరావాస చర్యలపై 

ప్రభుత్వ నిర్లక్ష్యం 

టీడీపీ వై.పాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

పెద్దారవీడు (మార్కాపురం) : వెలిగొండ పునరావాస చర్యలపై వైసీపీ నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తోందని టీడీపీ వై.పాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. పెద్దారవీడు మండలం సుంకేసులలోని కాటం రాజుకు ఆయన ఆదివారం ప్రత్యేక పూజలు ని ర్వహించారు. అనంతరం సుంకేసుల, కల నూతల, గుండంచ్లె గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాను న్న ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావడం ద్వారా వెలిగొండ పూర్తి అవుతుందన్నారు. నవరత్నాల పేరుతో  జగన్‌ ప్రజలను ప్రజలను నయవంచనకు గురి చేస్తున్నారని అన్నారు.  టీడీపీ కార్యకర్తలు ఐక్యంగా ఉండి ప్రజా వ్యతిర ేక విధానాలను అనుసరిస్తున్న వైసీపీ పాలకు లపై పోరాడుతూనే ప్రజలకు వెన్నుదన్నుగా ఉండాలని ఎరిక్షన్‌బాబు పిలుపునిచ్చారు. కార్య క్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెన్నా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ గుమ్మా గంగ రాజు, మాజీ మండలపార్టీ అధ్యక్షులు గొట్టం శ్రీనివాసరెడ్డి  పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-26T06:13:47+05:30 IST