రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన

ABN , First Publish Date - 2022-01-19T05:08:00+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన
ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యేలు రవికుమార్‌, స్వామి, మాజీ ఎమ్మెల్యేలు అశోక్‌రెడ్డి, నారాయణరెడ్డి, పాపారావు, దర్శి ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌

టీడీపీ నేతల ధ్వజం.. మారెళ్లలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

భారీగా హాజరైన తెలుగు తమ్ముళ్లు


మారెళ్ళ(ముండ్లమూరు), జనవరి 18: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో దాడులు తప్ప అభివృద్ధి లేదన్నారు. కేవ లం తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఏ గ్రా మంలో కూడా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవన్నారు. మంగళవారం మారెళ్ళ గ్రామ బస్టాండ్‌ సెంటర్‌లో స్వర్గీయ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా జరిగిన సభకు టీడీపీ దర్శి నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ అధ్యక్షత వ హించారు. ముఖ్య అతిథిగా హాజరైన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ మాట్లాడుతూ మారెళ్లలో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన జనాన్ని చూస్తుంటే ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీ పీ సునామీ ఖాయంగా కనిపిస్తుందన్నారు. మొత్తం 175 స్థా నాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో 12 స్థానాలకు 12 వస్తాయన్నారు. జనంలో కసి అంతగా కనిపిస్తుందన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు. తిరిగి తెలుగుదేశం పూర్వ వైభవం సంతరించుకుంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్‌ అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, వైసీపీని బంగాళఖాతంలో పడేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. కొండపి ఎమ్మెల్యే స్వామి మాట్లాడు తూ బడుగు, బలహీనవర్గాలకు గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్‌ అన్నారు. మరో రెండేళ్లల్లో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. మార్కాపురం, గిద్దలూరు, దర్శి మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుమళ్ళ అశోక్‌రెడ్డి, నారపశెట్టి పాపారావు, వైపాలెం ఇన్‌చార్జ్‌ ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ అడుగు జాడల్లో ప్రతిఒక్కరూ నడుచుకోవాలన్నారు. అనంతరం అతిథులందరికీ గ్రామ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ట్రాక్టర్‌ పై అతిథులను ఊరేగింపుగా ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్దకు తీసుకొచ్చారు. విగ్రహావిష్కరణకు వేలమంది టీడీపీ శ్రేణు లు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దర్శి మునిసిపల్‌ చైర్మన్‌ నారపశెట్టి పిచ్చయ్య, మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, మాజీ జడ్పీటీసీలు కొక్కెర నాగరాజు, వరగాని పౌలు, తెలుగు రైతు అధ్యక్షుడు మేదరమెట్ల వెంకటరావు, ఎంపీటీసీలు సుబ్బారావు, మాజీ ఎంపీటీసీలు సుంకర రాఘవరెడ్డి, వాకా బ్రహ్మారెడ్డి, నరేంద్ర, సర్పంచ్‌లు కూరపాటి నారాయణ స్వామి, ఒద్దిపోగు గురవయ్య, మాజీ సర్పంచ్‌లు బద్రి గోపాలరెడ్డి, కూరపాటి శ్రీనివాసరావు, చావా బ్రహ్మయ్య, మాజీ ఎంపీటీసీలు జంపాని శ్రీనివాసరావు, ఇందూరి పిచ్చిరెడ్డి  పాల్గొన్నారు.


సభకు అడుగడుగునా ఆటంకాలు

ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణతో పాటు సభను అడ్డుకోవాలని అధికారపార్టీ తన వంతు ప్రయత్నాలు చేసింది. స్థ లం ప్రభుత్వ స్థలమని, రెవెన్యూ అధికారులు విగ్రహావిష్కరణ వద ్దకు పంపటం ఒక ఎత్తయితే, పోలీసులు సభాస్థలాన్ని మార్పించారు. దానికితోడు మైకులు ఆపించటంతో పాటు విగ్రహావిష్కరణ సమయంలో గ్రామమంతా కరెంటు తీసివేయటం లాంటి చర్యలకు పాల్పడ్డారు. దీంతో సభకు వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు గ్రామస్థులు ఇదేం పాలన అంటూ విమర్శించారు. 

Updated Date - 2022-01-19T05:08:00+05:30 IST