‘అరాచక పాలనకు చరమగీతం పాడాలి’

ABN , First Publish Date - 2021-12-04T06:45:38+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, అమలాపురం పార్లమెంటు టీడీపీ ఇన్‌చార్జి హరీష్‌మాధుర్‌ అన్నారు.

‘అరాచక పాలనకు చరమగీతం పాడాలి’

ఆత్రేయపురం, డిసెంబరు 3: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, అమలాపురం పార్లమెంటు టీడీపీ ఇన్‌చార్జి హరీష్‌మాధుర్‌ అన్నారు. శుక్రవారం  వాడపల్లి, లొల్ల గ్రామాల్లో ఆత్మగౌరవ సభలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో దోపిడీ, అరాచకం, కక్షసాధింపు చర్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అప్రజాస్వామిక విధానాలు, రాక్షసపాలనపై టీడీపీ పోరాటం సాగిస్తోందన్నారు. సీఎం జగన్‌ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే బుద్ధిచెబుతారని హెచ్చరించారు. లొల్లలో వైసీపీ, జనసేనల నుంచి 50మంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు, ముళ్లపూడి భాస్కరరావు, కరుటూరి నరసింహారావు, తోటకూర సుబ్బరాజు, యల్లమిల్లి జగన్‌, కాయల జగన్నాధం, పాలింగి రవిచంద్ర, అల్లు వెంకటరమణ, చిటికెన సత్యనారాయణ, మెర్ల రాము, తోట రజని పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-04T06:45:38+05:30 IST