Abn logo
Feb 3 2020 @ 17:42PM

పల్నాడులో మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ నేతలు

గుంటూరు::

పల్నాడులో వైసీపీ శ్రేణులు మరోసారి రెచ్చిపోయాయి. పిడుగురాళ్లకు చెందిన డాక్టర్‌ శేఖర్‌బాబుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. శేఖర్ బాబును నిర్బంధించి రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం నేడు ఉదయం రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ప్రస్తుతం బాధిత వైద్యుడు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిర్లక్ష్యంగా వ్యహరించినట్లు బాధిత డాక్టర్ ఆరోపించారు. అయితే పోలీసులు ఉన్నతాధికారులు కల్పించుకోవడంతో పిడుగురాళ్లలో కేసు నమోదు చేశారు. నిందితులు మట్టారెడ్డి, సతీష్ రెడ్డి, ఫకీరారెడ్డి, సత్తార్ సీతారామ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కాగా, నిందితుల్లో ఒకరైన సతీష్ రెడ్డి.. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Advertisement
Advertisement
Advertisement