అరాచకం...

ABN , First Publish Date - 2021-01-15T05:30:00+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అఽధికారంలోకి వచ్చిన తరువాత పల్నాడులోని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులపై దాడులు, హత్యాయత్నాలు, హత్యలకు తెగబడ్డాయి.

అరాచకం...

వైసీపీ శ్రేణుల దాడులతో పల్నాడు ప్రాంత వాసుల్లో వణుకు 

అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నట్లు బాధితుల ఆరోపణ

హత్యకేసును నీరుగారుస్తున్నారంటున్న కుటుంబ సభ్యులు

భయాందోళనలో గ్రామాలను వదిలిన టీడీపీ శ్రేణులు


నాడు ఆత్మకూరు నుంచి నేడు జంగమహే శ్వరపాడు వరకు వైసీపీ అరాచకాలతో పల్నాడు వణుకుతోంది. ఒకప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఫ్యాక్షన్‌ నేపథ్యం ఉన్న పల్నాడు లో ఇరువర్గా లు ఢీ అంటే ఢీ అనేలా ఫ్యాక్షన్‌ పోరుకు తహతహలాడేవి. అటువంటి పల్నాడు పల్లె ల్లో ప్రస్తుతం నిశ్శబ్దం, భయాం దోళన నెల కొన్నాయి. అధికార వైసీపీ అరాచకాలతో  ఆ పల్లెలు భయంతో గజగజలాడుతున్నాయి.



గుంటూరు, జనవరి 15: రాష్ట్రంలో వైసీపీ అఽధికారంలోకి వచ్చిన తరువాత పల్నాడులోని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులపై దాడులు, హత్యాయత్నాలు, హత్యలకు తెగబడ్డాయి. దీంతో పల్నాడులోని టీడీపీ శ్రేణులు అత్యధికచోట్ల గ్రామాలను వదిలి పారిపోయే పరిస్థితి తలెత్తింది. ఆత్మకూరులో టీడీపీ వర్గీయులు గ్రామం వదిలి వెళ్లడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ గుంటూరు లోని పార్టీ కార్యాలయంలో వైసీపీ బాధిత పునరావాస శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి కూడా పిలుపు నిచ్చింది. ఆ తరువాత గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు అనిపించినప్పటికీ అత్యధిక గ్రామాల్లో వైసీపీ వర్గీయుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అనేక గ్రామాల్లో టీడీపీ నాయకులు గ్రామాలను వదిలి వెళ్లిపోయారు. అనేక మంది ప్రాణభయంతో వైసీపీలో చేరారు. ఎక్కడైనా వైసీపీ దౌర్జన్యాలను ఎదిరిస్తే వారిపై దాడులు లేదంటే తప్పుడు కేసులు బనాయిస్తున్నట్లు టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల దాచేపల్లిలో జరిగిన టీడీపీ నాయకుడు అంకులు హత్య పల్నాడులో అలజడి రేపింది. ఈ ఘటనతో టీడీపీ నేతల్లో భయాందోళన నెలకొంది.


హత్య జరిగినా అనుమానాస్పద కేసు

ఇటీవల పల్నాడులోని మాచర్ల నియోజకవర్గం దుర్గి మండ లంలోని జంగ మహేశ్వ రపాడులో టీడీపీకి చెందిన ఆరెద్దుల కోటయ్య(70), వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడి మృతి చెందినట్లు ఆయన కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.  నూ తన సంవత్సరం సందర్భంగా గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై కేకలు వేస్తూ గొడవ చేస్తుండటంతో అదేంటని ప్రశ్నించిన టీడీపీ వర్గీయులపై దాడికి దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. అయితే ఈ దాడిలో గాయపడిన టీడీపీకి చెందిన  కోటయ్య గుంటూరులోని జీజీహెచ్‌లో చేరి కొద్దిరోజులు చికిత్స తీసు కున్నాడు.  కోటయ్య ఒంటిపై గాయాలున్నాయి. జీజీహెచ్‌లో ఎం ఎల్‌సీ కూడా చేశారు. అయితే ఈ నెల 10న కోటయ్య మృతిచెందాడు. గురజాల ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాచర్ల ఇన్‌చార్జ్‌ చలమారెడ్డి గురజాల ఆసుపత్రికి వెళ్ళి కోటయ్య మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులతో మాట్లాడారు. వైసీపీ వారి దాడుల కారణంగానే కోటయ్య మృతి చెందాడని, ఆయన మృతదేహాన్ని తీసుకెళ్ళి దహనం చేయకుండా ఆసుపత్రికి ఎందుకు తీసుకొచ్చారని ఎస్‌ఐ తమను బెదిరించాడని కుటుంబసభ్యులు ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు.  మీరు ఘర్షణ కేసులో నిందితులని, మీ ఫిర్యాదు ఎలా తీసుకుంటామని కూడా ఎస్‌ఐ బెదిరించినట్లు వారు ఆంజనేయులు దృష్టికి తీసుకొచ్చారు. అయితే జనవరి1న ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై ఏఏ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారో..? ఇరువర్గాలకు చెందిన ఎంతమందిపై కేసు నమోదయిందనేది కూడా పోలీసులు ప్రకటించడం లేదు. అయితే ఈ ఘర్షణకు సంబంధించి టీడీపీకి చెందిన సుమారు 27 మందిని అరెస్ట్‌ చేయగా వారు గురజాల సబ్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. అదే ఘటనలో గాయపడి మృతి చెందిన కోటయ్య విష యంలో హత్య కేసు నమోదు చేయకుండా అనుమానాస్పద మృతి (174) సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడాన్ని కూడా పలువురు తప్పు పడుతున్నారు. ఇప్పటికీ జంగమహేశ్వరపాడులో టీడీపీకీ చెందిన ముఖ్య నాయకులు సుమారు ఏడాదిన్నరగా గ్రామం వదిలి వెళ్లిపోగా, తాజాగా జరిగిన కోటయ్య ఘటనతో మిగిలిన కొద్ది మందిలో కొందరు జైలుకు వెళ్లగా మిగిలినవారు ఊరొదిలి వెళ్ళిపోయారు. ధైర్యంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యా దు చేసే పరిస్థితి దుర్గి మండలంతో పాటు మా చర్ల, గురజాల నియోజకవర్గాల్లో లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసులు

 అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ వర్గీయుల నుంచి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలిగిన పోలీ సులు కూడా వారికే కొమ్ముకాస్తుండ టంతో టీడీపీ శ్రేణుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. మండలస్థాయి నాయ కులు సైతం వైసీపీ నేతల అరాచకాలు, పోలీ సుల ఏకపక్ష వెఖరిపై నోరుమెదపలేని పరిస్థితిలో ఉండటంతో గ్రామస్థాయి నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీకి పట్టున్న గ్రామాలపై పోలీసులతో బెదిరింపులు, తప్పుడు కేసుల కు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కొంత మంది ఎస్‌ఐలు, సీఐల వ్యవహారం చర్చనీయంశంగా మారింది. టీడీపీ శ్రేణులను స్టేషన్‌కి పిలిపించి పార్టీ మార తారా.. లేదంటే జైల్లోకి వెళతారా అంటూ నేరుగా బెదిరింపులకు దిగుతున్నారని ఇటీవల పలువురు బాఽధితులు రూరల్‌ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-01-15T05:30:00+05:30 IST